అప్పుడు ఫ్యాన్‌... ఇప్పుడందరి ఫేవరెట్‌!

‘శ్రేయాంకా పాటిల్‌’ నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే! ఎవరీ అమ్మాయంటూ తెగ వెదికేస్తున్నారు. కారణం... ‘ఈసారి కప్పు మనదే’ అన్నమాటను నిజం చేసింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. అందులో కీలకంగా నిలిచిన వారిలో ఈ అమ్మాయి పాత్రా ఎక్కువే మరి!

Updated : 19 Mar 2024 05:02 IST

‘శ్రేయాంకా పాటిల్‌’ నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే! ఎవరీ అమ్మాయంటూ తెగ వెదికేస్తున్నారు. కారణం... ‘ఈసారి కప్పు మనదే’ అన్నమాటను నిజం చేసింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. అందులో కీలకంగా నిలిచిన వారిలో ఈ అమ్మాయి పాత్రా ఎక్కువే మరి!

చ్చిన ఆటగాడిని కలిసే అవకాశమొస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఓ ఆటోగ్రాఫ్‌, వీలుంటే ఒక ఫొటో అడిగేస్తాం... అవునా? శ్రేయాంక మాత్రం అందుకు భిన్నం. ఆ అభిమాన ఆటగాడి స్ఫూర్తితో తను ఆడే ఫ్రాంచైజీకే ప్రాతినిధ్యం వహించి, స్టార్‌ ప్లేయర్‌గా ఎదిగింది. తన ఆరాధ్య ఆటగాడికి కూడా సాధ్యం కాని ఘనతను అందుకుంది. ఈ కర్ణాటక అమ్మాయి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కి పెద్ద ఫ్యాన్‌. ‘కమాన్‌ ఆర్‌సీబీ...’ అంటూ ప్రేక్షకుల మధ్య కూర్చొని ఎన్నిసార్లు జట్టుని ప్రోత్సహించి ఉంటుందో! ఓసారి అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని కలిశాక తనకీ క్రికెట్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంకేం మైదానంలోకి దిగింది. భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తానని అప్పటికి చిన్నారి శ్రేయాంక కూడా ఊహించి ఉండదు. శ్రేయాంకది బెంగళూరు. నాన్న చిరువ్యాపారి, అమ్మ గృహిణి. తన ఆసక్తిని గమనించి క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ రాణించిన శ్రేయాంక కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున అండర్‌-16, అండర్‌-19 టీమ్‌ల్లో స్థానం సంపాదించింది. నాయకురాలిగా జట్టునీ నడిపించింది. గత ఏడాది టీ20, వన్డే టీమ్‌ల్లో చోటు సంపాదించి... అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సత్తా చాటింది. గత డబ్ల్యూపీఎల్‌లో ‘ఆర్‌సీబీ’లో స్థానం సంపాదించి, చిన్ననాటి కల నెరవేర్చుకుంది శ్రేయాంక. కానీ ఆ జట్టు పెద్దగా ఆడలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో జట్టుతోపాటు తనూ బరిలోకి దిగింది. తీరా శ్రేయాంక నాలుగు మ్యాచ్‌లాడి, వంద పరుగులిచ్చింది. తీసిందీ రెండు వికెట్లే. ఇంతలో చేతికి గాయమై రెండు మ్యాచ్‌లకీ దూరమైంది. సాధారణంగా ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. శ్రేయాంక మాత్రం కోచ్‌ వద్దకెళ్లి ‘నేను సరిగ్గా ఆడటం లేదు. కొన్ని పొరపాట్లు చేశా. అవి మార్చుకోవాలి’ అంటూ ఆటతీరును విశ్లేషించుకుంది. తరవాతి నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయడమే కాదు, తమ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లడంలోనూ సాయపడింది. తుదిపోరులో 4 వికెట్లు తీసి, ‘ఆర్‌సీబీ’ గెలుపులో పాత్ర పోషించింది. ఈ ఏడాదికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ ట్రోఫీతోపాటు అత్యధిక వికెట్లు సాధించిన వారికిచ్చే పర్పుల్‌ క్యాప్‌నీ అందుకుంది. ఆ పోరాటపటిమని చూసి అంతా ఆశ్చర్యపోవడమే కాదు... ‘వారియర్‌’ అనీ పిలుస్తున్నారు. తనుమాత్రం ‘ఓడటానికి ఎప్పుడూ భయపడొద్దు. దాన్నుంచి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే విజేతలం అవుతాం’ అంటోంది. ఇంతకీ ఈమె వయసెంతో తెలుసా? 21ఏళ్లు. ఇంత పిన్నవయసులో ఇంత పరిపక్వత, దేనికీ తొణకని తత్త్వం... స్ఫూర్తిదాయకమేగా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్