వంటింట్లో వర్ణాలు!

కమలకు తెలుపు టీషర్ట్‌ అంటే ఇష్టం. కానీ నాలుగు సార్లు వాడాక అది సహజ మెరుపును కోల్పోయింది. దాన్ని వాడలేక, అలాగని పడేయలేక బాధపడేది. చాలామందికి ఇటువంటి సందర్భాలెదురవుతాయి. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. పాత దుస్తులకు ఇంట్లోనే సహజ వర్ణాలతో హంగులద్దొచ్చు. అదెలాగో చూద్దాం....

Updated : 28 Jun 2021 12:24 IST

కమలకు తెలుపు టీషర్ట్‌ అంటే ఇష్టం. కానీ నాలుగు సార్లు వాడాక అది సహజ మెరుపును కోల్పోయింది. దాన్ని వాడలేక, అలాగని పడేయలేక బాధపడేది. చాలామందికి ఇటువంటి సందర్భాలెదురవుతాయి. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. పాత దుస్తులకు ఇంట్లోనే సహజ వర్ణాలతో హంగులద్దొచ్చు. అదెలాగో చూద్దాం.

ఉల్లి తొక్కతో ...

బకెట్‌లో సగం నీటిని నింపాలి. ఓ తెలుపు బనియన్‌ను తీసుకొని, దానిని కింద పరిచి, అందులో గుప్పెడు ఉల్లిపాయ తొక్కలను, రెండు చెంచాల వెనిగర్‌ను వేసి మూటలా చుట్టాలి. దీన్ని బకెట్‌లోని నీళ్లలో మునిగేలా పావుగంట సేపు ఉంచాలి. ఈ రెండింటి మధ్య జరిగిన చర్య వల్ల ఏర్పడిన ఆకుపచ్చని రంగు బనియన్‌కు పూర్తిగా పట్టి కొత్తగా కనిపిస్తుంది.

క్యారెట్‌ ఆకులతో ...

క్యారెట్‌ దుంప ఆకులను విడిగా తీసుకోవాలి. రంగు మార్చాల్సిన బనియన్‌ లేదా స్కర్టును తీసుకొని, అందులో ఈ ఆకులను ఉంచి ఉండలా చుట్టాలి. ఈ ఉండను నీళ్లున్న పెద్ద గిన్నెలో మునిగేలా ఉంచి మరగబెట్టాలి. ఆకుల్లోని వర్ణకాల వల్ల ఆ వస్త్రం పసుపు ఛాయలోకి మారుతుంది.

బీట్‌రూట్‌తో...

కులు, కాడల సహా రెండు దుంపలను ముక్కలుగా కోసి నీటిలో ఉడికించాలి. నీటి వర్ణం మారిన తర్వాత అందులో రెండు చెంచాల వైట్‌ వెనిగర్‌ కలిపి పొయ్యిపై నుంచి దింపేయాలి. ఈ నీటిని వడకట్టి అందులో రంగు మార్చాల్సిన వస్త్రాన్ని ముంచి తిరిగి అయిదు నిమిషాలు చిన్నమంటపై వేడిచేస్తే చాలు. లేత ఊదారంగుతో మీ దుస్తులు కొత్తగా తయారవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్