మొక్కలకు పాలు పోస్తే..

ఇంటికి అందాన్నీ, మనసుకు ఆహ్లాదాన్నీ ఇస్తాయి మొక్కలు. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో ఇవి దర్శనమిస్తున్నాయి. అయితే అవి ఏమాత్రం వడలిపోయినా మనసుకు బాధేస్తుంది. ఈ చిన్ని

Published : 20 Sep 2021 01:03 IST

ఇంటికి అందాన్నీ, మనసుకు ఆహ్లాదాన్నీ ఇస్తాయి మొక్కలు. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో ఇవి దర్శనమిస్తున్నాయి. అయితే అవి ఏమాత్రం వడలిపోయినా మనసుకు బాధేస్తుంది. ఈ చిన్ని చిట్కాలను ప్రయత్నించి చూడండి. వంటింట్లో దొరికేవే ఇవన్నీ!

* కొన్ని మొక్కలు ముఖ్యంగా ఇండోర్‌ ప్లాంట్స్‌ ఆకుల చివర్లు ఎండినట్లుగా కనిపిస్తుంటాయి. పావు కప్పు పచ్చిపాలకు రెండింతలు నీళ్లు కలిపి, మొక్క మొదళ్లో పోయండి. ఓ వారంపాటు నిత్యం ఇలా చేసి చూడండి. నిగనిగలాడే మొక్క మళ్లీ మీకు దర్శనమిస్తుంది.

* ఆకులపై మచ్చలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వంటివి కనిపిస్తే బైకార్బోనేట్‌ను చెంచా మొక్క మొదళ్లలో వేసి చూడండి. ఫలితముంటుంది.

* ఆకులు కాలినట్లుగా, ముడుచుకుపోతుంటే ఓ వారం పాటు మొక్కకు పోసే నీటిలో కొద్దిగా ఈస్ట్‌ను కలిపి పోయండి. మళ్లీ ఆరోగ్యంగా కనిపిస్తుంది.

* ఆలూ పొట్టును రెండు రోజులపాటు నీళ్లలో నానబెట్టి, వాటిని మొక్కలకు పోస్తే బాగా ఎదుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్