మామూలు ఇల్లే మనోహరంగా...

రోజంతా పనితో అలసిపోయిన మీకు ఇల్లు విశాలంగా లేదనో, హంగులూ ఆర్భాటాలూ లేవనో అనిపిస్తోందా? ఇంద్రభవనం లాంటి ఇల్లు లేదని బాధపడే కంటే మామూలు ఇంటినే మనోహరంగా మలచుకోండి. అందుకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు.. కొంచెం శ్రమ, ఇంకొంచెం అభిరుచీ ఉంటే చాలు...

Updated : 08 Sep 2022 15:52 IST

'

రోజంతా పనితో అలసిపోయిన మీకు ఇల్లు విశాలంగా లేదనో, హంగులూ ఆర్భాటాలూ లేవనో అనిపిస్తోందా? ఇంద్రభవనం లాంటి ఇల్లు లేదని బాధపడే కంటే మామూలు ఇంటినే మనోహరంగా మలచుకోండి. అందుకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు.. కొంచెం శ్రమ, ఇంకొంచెం అభిరుచీ ఉంటే చాలు...
* ఎంతసేపూ పనే తప్ప చదువుకోడానికి ఓ గది లేదని దిగులుపడే బదులు లివింగ్‌ రూం లోనే ఒక పక్కగా పుస్తకాల బీరువా లేదా షెల్ఫ్‌ పెట్టించేయండి. సుఖంగా వెనక్కి వాలి చదువుకునే సోఫా అమర్చితే చాలు అదే లైబ్రరీలా మారుతుంది. పిల్లలు కూడా ఎంచక్కా హోంవర్క్స్‌ చేసుకోవచ్చు.
* అద్దె ఇల్లయితే ఆ గోడల రంగులు ఒక్కోసారి నచ్చవు. అందుకు అసంతృప్తి పక్కర్లేలేదు. ఆ రంగులకు సరిపోయే వాల్‌ హ్యాంగింగ్స్‌ తగిలించండి. తెలిసిన ఆర్టిస్టు ఎవరైనా ఉంటే సరదాగా మ్యూరల్‌ పెయింట్‌ వేయమని అడగండి. కాదంటే చవకగా దొరికే అందమైన పోస్టర్లను అతికించండి.
* ఇంటికి కళ తెచ్చేది ఫర్నిచరే కదా! తక్కువ ఖరీదులో కూడా కళాత్మకమైన కుర్చీలూ టీపాయ్‌ లాంటివి దొరుకుతాయి. అవి మీ అభిరుచికి సంకేతం, మీ ఇంటికి అలంకారం.
*కిటికీ లోంచి ప్రకృతి దృశ్యాలు కనిపించే అవకాశం ఉంటే ఇక దానికి వంక పెట్టనవసరమే లేదు. అందుకు భిన్నంగా పక్క పోర్షన్లు కనిపిస్తోంటే చక్కటి కర్టెన్లు వేయండి. ఇటు ప్రైవసీ ఉంటుంది, అటు అందంగానూ ఉంటుంది.
* అక్కడక్కడా కొన్ని ఇండోర్‌ ప్లాంట్స్‌ అమర్చండి. డైనింగ్‌ టేబుల్‌, టీపాయ్‌ మీద కొన్ని తాజా పూలున్న వాజ్‌లు పెట్టండి. విసుగు మాయమై హాయిగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్