పంచముఖ గాయత్రి

ముక్తా విద్రుడు హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైఃయక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్‌గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాంశంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజేఈ రోజున అమ్మవారిది గాయత్రీదేవి రూపం.  

Published : 09 Oct 2021 01:51 IST

ముక్తా విద్రుడు హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్‌
గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే

ఈ రోజున అమ్మవారిది గాయత్రీదేవి రూపం.  సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన అమ్మవారిని ‘సర్వ చైతన్య రూపాం! పాం ఆద్యాం! విద్యాం చ ధీమహీ! బుద్ధిం య నహః ప్రచోదయ’ అంటూ ఆరాధిస్తాం. ఈ దేవతకు ముఖాలు అయిదైనా హృదయం ఒకటే. గాయత్రీదేవి విద్యాధిదేవత అనీ, బుద్ధి, శక్తిని ప్రచోదనం చేస్తుందని మహర్షులు సెలవిచ్చారు. ఏ స్త్రీ మూర్తి బుద్ధి చురుగ్గా ఉండి.. స్తబ్ధత లేకుండా చైతన్యంతో అడుగులు వేస్తుందో అలాంటి మహిళ వల్ల ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. సమాజమూ బాగుంటుంది. అలాంటి వారంతా గాయత్రీ దేవతలే... అని ఆమె రూపం బోధిస్తోంది. ‘కరణేషు మంత్రి’ అని గృహిణిని పేర్కొంటారు. సమయానికి తగిన సలహాలూ, సూచనలూ అందించగల సమర్థురాలు గృహిణి అని అర్థం. ఈ లక్షణం కూడా గాయత్రీ తత్వమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్