వంటగది ఒత్తిడి తగ్గిస్తే...

గృహిణులైనా, ఉద్యోగినులైనా... మహిళలు ఎక్కువ సేపు గడిపేది వంట గదిలోనే! ఇలాంటి చోటుని ఆహ్లాదం పంచేదిగా, సౌకర్యంగా ఉండేలా మార్చేస్తే ఎంత బాగుంటుందో కదా... అందు కోసమే ఈ చిట్కాలు...

Updated : 29 Oct 2021 06:16 IST

గృహిణులైనా, ఉద్యోగినులైనా... మహిళలు ఎక్కువ సేపు గడిపేది వంట గదిలోనే! ఇలాంటి చోటుని ఆహ్లాదం పంచేదిగా, సౌకర్యంగా ఉండేలా మార్చేస్తే ఎంత బాగుంటుందో కదా... అందు కోసమే ఈ చిట్కాలు...

* ఎన్ని వస్తువులు, పాత్రలు ఉంటే అంత మేలు అనుకోవడం పాత పద్ధతి. ఇంటిల్లిపాదికీ, రోజూ అవసరాలకు లెక్కేసుకుని ఒకటో రెండో ఎక్కువగా పెట్టుకుంటే చాలు. ఎక్కువ గిన్నెల్ని శుభ్రపరచాల్సిన సమస్య తప్పుతుంది.

* నాలుగైదు స్టోరేజ్‌ బాక్సులు తెచ్చుకోండి. ఓ దానిలో కత్తిరించిన సరకుల ప్యాకెట్లు, ఇంకోదానిలో నిల్వ ఉంచాల్సినవి... ఇలా పెట్టుకోండి. వాటిపై స్టికర్లేస్తే అవసరమైనప్పుడు తేలిగ్గా తీసుకోవచ్చు.

* దినుసులని నిల్వ చేయడానికి పారదర్శకంగా, ఒకేలా ఉండే వివిధ పరిమాణాల డబ్బాలు, సీసాల్ని ఎంచుకోండి. వీటికీ ఆయా పేర్లతో స్టిక్కర్లు వేసేయండి. దాంతో ఏది ఎక్కడ పెట్టామో వెతుక్కునే బాధ ఉండదు. వివిధ పరిమాణాల్లో ఉన్నవైతే అవరోహణ క్రమంలో అమర్చుకుంటే చూడటానికీ బాగుంటాయి.

* కప్‌బోర్డ్‌లలో చాలామంది పాతపేపర్లను వేస్తారు. ఇవి త్వరగా పాడవుతాయి. రంగు మారడం, నలిగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటికి బదులు మార్కెట్‌లో దొరుకుతోన్న వాటర్‌ప్రూఫ్‌ షెల్ఫ్‌ షీట్‌లను వేయడం వల్ల అవి త్వరగా పాడవ్వవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్