మొక్కల్ని వేలాడదీద్దామా!

వేడుకైనా, పండగలైనా ఇళ్లంతా పూలతో అలంకరించేస్తాం. అందంగా కనిపిస్తూనే మనసుకీ హాయిని కలిగించేస్తాయవి. అలాంటివి రోజూ కళ్లముందుంటే ఎంత బాగుంటుందో కదా! అయితే దీన్ని ప్రయత్నించండి. సులువుగా చేసేసుకోవచ్చు.

Updated : 15 Dec 2021 03:15 IST

వేడుకైనా, పండగలైనా ఇళ్లంతా పూలతో అలంకరించేస్తాం. అందంగా కనిపిస్తూనే మనసుకీ హాయిని కలిగించేస్తాయవి. అలాంటివి రోజూ కళ్లముందుంటే ఎంత బాగుంటుందో కదా! అయితే దీన్ని ప్రయత్నించండి. సులువుగా చేసేసుకోవచ్చు.

కావాల్సిందల్లా.. గ్రీన్‌ గార్డెన్‌ నెట్‌, తాడు, కత్తెర, రంగురంగుల పూలుపూసే గడ్డి గులాబీ మొక్క కొమ్మలు. వీటినే పార్చ్యులక, 9 ఓ క్లాక్‌ ఫ్లవర్‌ అనీ పిలుస్తారు.

ఇప్పుడు.. పెద్ద పాత్రలో మట్టి, ఇసుక, వర్మి కంపోస్ట్‌ను సమాన భాగాలుగా తీసుకోవాలి. ఇందులో బంతిని చేసుకునే వీలుగా నీటిని పోస్తూ కలిపి పక్కన పెట్టుకోవాలి. గ్రీన్‌ గార్డెన్‌ నెట్‌ను చతురస్రాకారంలో కట్‌ చేసుకుని ఆ మిశ్రమాన్ని దానిలో ఉంచి, బంతిలా తాడుతో బిగుతుగా కట్టాలి. ఆపై బాల్‌ పైభాగాన అదనంగా ఉన్న నెట్‌ను, ముడివేయగా మిగిలిన ప్లాస్టిక్‌ తాడును కట్‌ చేయాలి. చిన్నచిన్న కొమ్మలుగా కత్తిరించి గడ్డి గులాబీ మొక్కల కాడలను ఈ బాల్‌ లోపలికి దూర్చాలి. మొత్తం పూర్తి చేశాక కారిడార్‌ లేదా బాల్కనీలో వేలాడదీస్తే చాలు. కొద్దిరోజుల్లోనే వీటి నుంచి పూలు పూయడం మొదలవుతుంది. భిన్న రంగులవి కలిపి పెట్టుకుంటే బాల్‌ అంతా రంగులమయంగా కనిపిస్తుంది. వీటికి కొద్దిపాటి నీరు సరిపోతుంది. పోషణా తక్కువే! ఇంటికీ కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్