వంటిల్లు... హాయిగా!

వంటిల్లు చెమ్మగా ఉన్నా, క్రిమి కీటకాలు చేరినా చిరాకేస్తుంది కదూ! మరి అలాంటి ఇబ్బందులు లేకుండా వంటిల్లు హాయిగా ఉండాలంటే ఈమాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందే...

Published : 27 Dec 2021 00:42 IST

వంటిల్లు చెమ్మగా ఉన్నా, క్రిమి కీటకాలు చేరినా చిరాకేస్తుంది కదూ! మరి అలాంటి ఇబ్బందులు లేకుండా వంటిల్లు హాయిగా ఉండాలంటే ఈమాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందే...

* వంటింటి తలుపు, కిటికీలు వీలైనంత ఎక్కువసేపు తెరిచి ఉంచి గాలీ వెలుతురూ లోనికి ప్రసరించేట్లు చూడండి. లేదంటే బొద్దింకల్లాంటి జీవాలకు ఆవాసమవుతుంది. చెద పురుగు చేరే అవకాశమూ ఉంది.

* వంట నూనెల వల్ల ఏర్పడే జిడ్డు కారణంగా వంటింట్లో దుమ్ము పేరుకుపోతుంది. ఎప్పటికప్పుడు శుభ్రపరచకుంటే ఆనక ఆ మకిలి వదిలించడం కష్టమే.

* సామాను పెట్టే కప్‌బోర్డ్స్‌లో, వంట గట్టు కింది భాగంలో, సింక్‌ మూలల్లో తడి చేరకుండా, దుమ్మూ, బూజూ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. లేదంటే క్రిమి కీటకాలూ చేరతాయి.

* సింక్‌ మూలల్లో, అరల్లో నీటి చెమ్మ ఉందేమో గమనించుకోండి. మూలల్లో సిలికా జెల్‌ ప్యాకెట్లు ఉంచండి. బొగ్గు ముక్కలను చిన్న మూటలా కట్టి ఉంచినా ఫలితం ఉంటుంది.

* ఖాళీ అయిన పాత్రలను సింక్‌లో నిలవ ఉంచితే అపరిశుభ్రంగా కనిపించడమే కాదు, బొద్దింకలూ వస్తాయి. ఎప్పటికప్పుడు శుభ్రపరిచి తడి లేకుండా ఆరబెట్టేయండి. ఈ మాత్రం సూత్రాలు పాటిస్తే ఇక వంటిల్లు హాయిగా ఉండటం తథ్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్