ఇవి గుర్తుచేస్తాయ్‌

ఇంట్లో ఖాళీ స్థలంలో రకరకాల విత్తనాలు నాటుతుంటాం. మొలకెత్తేలోపు వేటినెక్కడ వేశామో గుర్తుండకపోవచ్చు. తగిన జాగ్రత్త తీసుకోవడం ఇబ్బంది కదా! మార్కర్లను పెట్టుకుంటే సరి! ఎలాగంటే..

Published : 10 Jan 2022 01:20 IST

ఇంట్లో ఖాళీ స్థలంలో రకరకాల విత్తనాలు నాటుతుంటాం. మొలకెత్తేలోపు వేటినెక్కడ వేశామో గుర్తుండకపోవచ్చు. తగిన జాగ్రత్త తీసుకోవడం ఇబ్బంది కదా! మార్కర్లను పెట్టుకుంటే సరి! ఎలాగంటే..

ఐస్‌క్రీం పుల్లలు.. విత్తనాలు చల్లేటప్పుడే వాటి పేరును ఐస్‌క్రీం పుల్లలు, చెక్కచెంచాలు వంటివాటిపై స్కెచ్‌పెన్‌ లేదా మార్కర్‌తో రాసి తొట్టెలో ఓ పక్కగా మట్టిలో గుచ్చితే చాలు. మొలకల సమయం నుంచే వాటిని గుర్తించి, కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

కార్క్‌లు.. సీసా మూతల్లా వచ్చే కార్క్‌లనూ వినియోగించొచ్చు. సన్నని పుల్లలకు ఆయా మొక్కల పేర్లు రాసిన కార్క్‌లను అమర్చి వాటిని అక్కడ మట్టిలో గుచ్చితే చాలు. విత్తనాలు తెచ్చే కవర్లను కూడా మొలకల పక్కగా మట్టిలో ఉంచితే వాటి వివరాలు గుర్తుంటాయి.

పొట్ల, ఆనప, బీరకాయ వంటి కూరగాయలకు చిన్న పాదును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటికీ ఫొటోలున్న స్టిక్కర్లతో ముందే మార్క్‌ చేసుకుంటే ముందే పాదులను వేసుకోవచ్చు. అలాగే పూలమొక్కల పెంపకం, ఎన్ని రకాలు వేశామన్న వాటిపైనా అవగాహన ఉంటుంది. తగ్గట్లుగా నీటిని అందించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్