అప్పులొద్దు ఆదా చేద్దాం!

వంటావార్పూ పిల్లల పెంపకమే కాదు, పొదుపు ఉద్యమం కూడా ఇల్లాలి బాధ్యతే. ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కొనుక్కోవడం, ఇంటిల్లిపాదికీ ఏ కొరతా లేకుండా చూసుకోవడం, డబ్బు వ్యవహారాలు చక్కబెట్టుకోవడం లాంటివన్నీ ఆమె దక్షతకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల సూచనలు కొన్ని...

Updated : 26 Jan 2022 05:02 IST

వంటావార్పూ పిల్లల పెంపకమే కాదు, పొదుపు ఉద్యమం కూడా ఇల్లాలి బాధ్యతే. ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కొనుక్కోవడం, ఇంటిల్లిపాదికీ ఏ కొరతా లేకుండా చూసుకోవడం, డబ్బు వ్యవహారాలు చక్కబెట్టుకోవడం లాంటివన్నీ ఆమె దక్షతకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల సూచనలు కొన్ని...

* మీ రాబడి ఎంత, ఖర్చులు ఏమిటి అనేది ప్రణాళిక వేసుకోండి. చేస్తున్న ఖర్చులన్నీ డైరీలో రాయండి. డబ్బు దుబారా అవుతోంది అనిపించినప్పుడు డైరీ చూసి అనవసరం అనిపించినవాటిని తగ్గించేయండి.
* మీ ఆదాయం ఎంతైనా కానీయండి.. అందులో 30 శాతం కచ్చితంగా ఆదా చేయండి. లేదంటే రేపటి రోజున ఆర్థిక కష్టాలు తప్పవు. కేవలం పొదుపు చేస్తే సరిపోదు, మీకు తెలిసిన రంగంలో ఆ సొమ్మును పెట్టుబడిగా పెట్టండి. అలాగే మీ పిల్లలు కూడా ప్రతి నెలా కొంత మొత్తాన్ని సేవింగ్‌ ఎకౌంట్‌లో వేసేలా తర్ఫీదివ్వండి.
* వెచ్చాల దగ్గర నుంచి పిల్లల చదువులు, వైద్య ఖర్చులు.. ఇలా అన్నిటికీ బడ్జెట్‌ వేయండి. కోరికలకు, అవసరాలకు మధ్య తేడాను పిల్లలకు  వివరించి చెప్పండి. ఇది గనుక తెలిస్తే ఉన్నంతలోనే ఖర్చులు పెంచుకోకుండా సుఖంగా జీవనం సాగుతుందని అర్థం చేసుకుంటారు.
* మార్కెట్‌లో ఆకర్షణీయంగా కనిపించేవాటి మీద మనసు పారేసుకోవద్దు. ఏమేం కావాలో చిట్టా రాసుకుని వెళ్లి అవి మాత్రమే కొనండి. చూపులకు కళ్లాలు వేయకపోతే డబ్బులకు రెక్కలొచ్చేయడం తథ్యం. వీలైనంత వరకూ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించొద్దు.
* ఎంత రాబడి ఉన్నా సరిపోక అప్పులు చేసేవాళ్లున్నారు. కొద్ది ఆదాయంలోనే పొదుపుగా సంసారాన్ని నడిపేవారూ ఉన్నారు. కచ్చితంగా రెండేవారే మనకు ఆదర్శం కావాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్