రోజూ నీళ్లు పోస్తున్నారా..

మొక్కల పెంపకం ఇప్పుడు చాలామందికి వ్యాపకమైంది. వాటికేమైనా అయితేనేమో బాధ. అవి జాగ్రత్తగా పెరగాలనుకుంటే... ఈ చిట్కాలు మీ కోసమే..

Published : 28 Feb 2022 01:15 IST

మొక్కల పెంపకం ఇప్పుడు చాలామందికి వ్యాపకమైంది. వాటికేమైనా అయితేనేమో బాధ. అవి జాగ్రత్తగా పెరగాలనుకుంటే... ఈ చిట్కాలు మీ కోసమే..

మొక్కల మధ్య ఖాళీలు వదలితే బాగా పెరుగుతాయి. ఇందుకోసం అవసరమైతే టేప్‌ సాయం తీసుకోండి. అలాగే మట్టి కుండీలనే ఎంచుకోండి. ఇవి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని మొక్కలకు రక్షణనిస్తాయి. కూరగాయలు ఉడికించిన, బియ్యపు నీటిని పారపోయొద్దు. మొక్కలకు పోస్తే వాటికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మొక్క రకాలు, కాలాన్ని బట్టి రెండు, మూడు రోజులకొకసారి పోస్తే సరిపోతుంది.

మొక్కలను ఒకచోట నుంచి మరోచోటకు మార్చాలనుకుంటున్నారా... అయితే వానాకాలంలోనే చేయండి. అప్పుడైతే వేర్లు తెగకుండా తీసుకోవచ్చు. అంతేకాదు.. వాతావరణం చల్లగా, మబ్బులు పట్టిన సమయం మొక్కలు నాటడానికి అనువుగా ఉంటుంది. భగభగమండే ఎండల్లో నాటితే అవి చనిపోయే ప్రమాదముంది. మొక్కలకు నీటిని సూర్యోదయానికి ముందు లేదా సాయంత్రం వాతావరణం చల్లబడ్డాకే అందించాలి. మట్టికి దగ్గరగా ఉండే ఆకులు నీటిలో/మట్టిలో తడిచి త్వరగా తెగుళ్లకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి. అలాగే ఆరోగ్యంగా ఎదగాలంటే నీటితోపాటు కొన్ని పోషకాలూ కావాలి. కాబట్టి అప్పుడప్పుడు ఎరువు, కూరగాయల పొట్టు, టీ పొడి వంటివీ వేస్తుండండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్