ట్యూబ్‌నంతా ఖాళీ చేసేస్తుంది!

టూత్‌పేస్ట్‌ అయిపోతున్నప్పుడు బలమంతా ఉపయోగించి నొక్కి మరీ బ్రష్‌పై పెట్టుకుంటాం. అంతలా కష్టపడకుండా సులువుగా ట్యూబ్‌లో చివర ఉండే పేస్ట్‌ కూడా బయటకు వచ్చేలా చేయొచ్చు. ఎలా అంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న...

Published : 25 Apr 2022 01:07 IST

టూత్‌పేస్ట్‌ అయిపోతున్నప్పుడు బలమంతా ఉపయోగించి నొక్కి మరీ బ్రష్‌పై పెట్టుకుంటాం. అంతలా కష్టపడకుండా సులువుగా ట్యూబ్‌లో చివర ఉండే పేస్ట్‌ కూడా బయటకు వచ్చేలా చేయొచ్చు. ఎలా అంటే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘వర్టికల్‌ రోలింగ్‌ ట్యూబ్‌ స్క్వీజర్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ టూల్‌’తో. అయిదు సెంటీమీటర్ల వెడల్పుండే ఏ ట్యూబ్‌నైనా ఈ చిట్టి పరికరానికి బిగించొచ్చు.

పరికరంలో టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌ అంచును పెట్టి.. దానికి ఆనుకుని ఉన్న స్క్రూని సవ్యదిశలో తిప్పితే సరి. ట్యూబ్‌లో అడుగున ఉన్న పేస్ట్‌ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ధర కూడా తక్కువే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్