వాడలేం.. పడెయ్యలేం... ఏం చేద్దాం?

ఇల్లు ఎవరికి వాళ్లం మన ఇష్టాలూ, అభిరుచులూ, అవకాశాలకు అనుగుణంగా సర్దుకుంటాం. కానీ మరింత ముచ్చట గొలిపేలా తీర్చిదిద్దుకునేందుకు ఇంటీరియర్‌ డిజైనర్ల సూచనలు ఇవీ...

Published : 31 May 2022 01:02 IST

ఇల్లు ఎవరికి వాళ్లం మన ఇష్టాలూ, అభిరుచులూ, అవకాశాలకు అనుగుణంగా సర్దుకుంటాం. కానీ మరింత ముచ్చట గొలిపేలా తీర్చిదిద్దుకునేందుకు ఇంటీరియర్‌ డిజైనర్ల సూచనలు ఇవీ...

* చాలా వస్తువులు ఎప్పట్నుంచో పేరుకు పోయాయా! అయితే వాటిని విభజించి మూడు డబ్బాల్లో పెట్టేయండి. మొదటి దాంట్లో బిగుతైపోయిన దుస్తుల్లాంటివి, మీకు పనికిరానివి ఎవరికైనా ఇచ్చేసేందుకు. రెండో డబ్బాలో ఎవరికీ కొరగానివి, గార్బేజ్‌కు తరలించేయండి. మూడో డబ్బాలో రీసైకిల్‌ చేయతగ్గవి పెట్టి అమ్మేయండి.  మిగిలిన వాటిని కేటాయించిన అరల్లో సర్దేయండి.
* బీరువాలూ, కబోర్డ్స్‌లో పెట్టగా మిగిలిన వస్తువులను పెద్ద పెద్ద అట్ట పెట్టెల్లో సర్ది అటక ఎక్కించండి. పైకి ఎక్కించినవి మాటికీ దించాలంటే కష్టం కనుక వేటిల్లో ఏమున్నాయో లేబుల్స్‌ అతికించండి.
* గోడలు దృఢంగా ఉండి, చెమ్మ చేరనివైనా సరే.. అట్టపెట్టెల్లో దుస్తులు, పుస్తకాల్లాంటివి సర్దేసి పైన పెట్టారంటే కొన్నాళ్లకి ముక్కవాసన వస్తాయి. మనుషుల తాకిడి ఉండదు కనుక పురుగులు చేరతాయి. చెదలు కూడా పట్టొచ్చు. పైగా అట్టపెట్టెలు వంగడం, చిరగటం లాంటివి జరగొచ్చు. కనుక ప్లాస్టిక్‌ స్టోరేజ్‌ కంటెయినర్లలో సర్ది పెడితే సురక్షితంగా ఉంటాయి.
* ఫ్లోర్‌ క్లీనర్లు, యాసిడ్‌లు, సోపులు, వాషింగ్‌ పౌడర్లు లాంటివన్నీ సింక్‌ కింది భాగంలో అర ఏర్పాటుచేసి అందులో పెడితే అవసరానికి అందుబాటులో ఉంటాయి, అడ్డుగానూ అనిపించవు.
* వాడలేము, పడేయలేము అనుకున్న అదనంగా ఉన్న కుర్చీలూ బల్లల్లాంటివి పిల్లల గదిలో ఒక మూలగా పెట్టేయండి.
* టేపు, కత్తెర, స్కేలు, రంగులు, చార్టులు, కుంచెలు, చార్టుపేపర్లు, దారాలు, పూసలు లాంటి సామగ్రిని తెప్పించుకోండి. పిల్లల పుట్టిన రోజు లాంటి సందర్భాల్లో వాటితో వాల్‌ హ్యాంగింగ్స్‌ రూపొందించవచ్చు. గోడలను ముస్తాబు చేయొచ్చు. ఇలాంటివి తాత్కాలికంగా ఇంటికి అందం తేవడమే కాదు, చిన్నారులకు తీపిగుర్తులను మిగులుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్