వంటింట్లో తోట..

వంటచేస్తూ తాజా టొమాటోలను ఈ వంటింటి తోట నుంచి కోసి వినియోగించొచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు వంటివన్నీ ఈ తోట నుంచి అప్పటికప్పుడు తాజాగా కోసుకోవచ్చు. వంటింట పెంచే ఈ గ్రో రూం ఏర్పాటు తెలుసుకుందాం.

Updated : 19 Dec 2022 01:52 IST

వంటచేస్తూ తాజా టొమాటోలను ఈ వంటింటి తోట నుంచి కోసి వినియోగించొచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు వంటివన్నీ ఈ తోట నుంచి అప్పటికప్పుడు తాజాగా కోసుకోవచ్చు. వంటింట పెంచే ఈ గ్రో రూం ఏర్పాటు తెలుసుకుందాం.

ఇంటి వెనుక కూరగాయల మొక్కల పెంపకం లేదా వంటింటి కిటికీలో కొత్తిమీర, పుదీనా వంటివాటిని పెంచుకుంటే వంటలోకి తాజాగా వాటిని అప్పటికప్పుడు వినియోగించుకోవచ్చు. వీటన్నింటినీ ఒకేచోట తోటలా గదిలోనే ఏర్పాటు చేసుకొనే సౌలభ్యమే.. ఈ గ్రో రూం. వంటింట్లో ఓ మూలగా వెదురుతో రెండు అరలుండేలా ప్లాంట్‌ స్టాండ్‌ను సర్దుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, తోట కూర, పుదీనాల తొట్టెలను ఉంచాలి. వీటిపై 24 గంటలూ వెలుతురుపడేలా లైటు ఏర్పాటు చేయడమే కాకుండా, తగిన నీటిని అందించాలి. ఉదయం రెండుగంటలసేపు మాత్రం ఈ తొట్టెలను ఎండలో ఉంచాలి. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అవసరానికి తగ్గట్లు తాజా కూరగాయలను అందించడానికి ఈ తోట సిద్ధంగా ఉంటుంది.

ఫ్రిజ్‌లాంటిది.. చూడటానికి ఫ్రిజ్‌లా అనిపించే గ్రో రూంలో అన్ని రకాల ఆకు కూరలనూ పెంచుకోవచ్చు. చిగుళ్లను మాత్రమే తుంచి వాడుకుంటుంటే తిరిగి చిగురించి నిత్యం తాజా ఆకుకూరలు సిద్ధంగా ఉంటాయి. వీటిలో 2, 3 అరల స్టాండులో ట్రేల్లాంటివి ఉంటాయి. నీటితో నిండిన అరల్లో కావాల్సిన కూరగాయల మొక్కలను పెంచొచ్చు. కేవలం నీటితోనే పెరిగే ఈ మొక్కలకు ట్రే పైభాగాన ఉండే లైటు నుంచి వెలుతురు పడుతుంటుంది. దీంతో ఆకులు పత్ర హరితాన్ని తయారు చేసుకో గలుగుతాయి. వంటింట్లో పచ్చగా కనిపిస్తూ.. తాజా ఆకుకూరల తోట చూడ ముచ్చటగానూ ఉంటుంది. పోషకాలనూ అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్