వేలాడే పచ్చందాలు...

పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే మొక్కలంటే మెచ్చనిది ఎవరు? అయితే, చాలామందికి వీటిని ఇంట్లో పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నా...స్థలాభావంతో సాధ్యపడదు.

Published : 01 Mar 2023 00:05 IST

పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే మొక్కలంటే మెచ్చనిది ఎవరు? అయితే, చాలామందికి వీటిని ఇంట్లో పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నా...స్థలాభావంతో సాధ్యపడదు. అలాంటివారు ఈ చిన్నచిన్న చిట్కాలతో వేలాడే తోటనే సిద్ధం చేసుకోవచ్చు. అవేంటంటారా?

* గోడకో, బాల్కనీ గ్రిల్‌కో...మొక్కలను వేలాడదీసేందుకు కాస్త బరువైన హుక్స్‌ని వేయించుకోండి. వీటికి వేలాడదీసే కుండీలను రంగులూ, ఆకృతుల్లో వైవిధ్యంగా ఉన్నవి ఎంచుకుంటే చూడ్డానికీ బాగుంటుంది.

* వేలాడే కుండీల్లో మొక్కల్ని పెంచాలనుకునప్పుడు మట్టి విషయంలోనూ ఒకింత జాగ్రత్త తీసుకోవాలి. సారవంతమైన తేలికపాటి మట్టిని ఇందుకు వాడాలి. లేదంటే మట్టి బరువుకి వేలాడే కుండీ తెగిపోయే ప్రమాదం ఉంది. మట్టి తక్కువగా, కోకోపీట్‌ ఎక్కువగా ఉంటే చాలు. మొక్కలూ చక్కగా ఎదుగుతాయి.

* తరచూ పై నుంచి కిందకి దింపి మొక్కలకు పోషకాలు అందివ్వడం కష్టమైన విషయం. అందుకే కోకోపీట్‌ మట్టి మిశ్రమంలోనే కాసిన్ని మల్టీ మినరళ్లతో కూడిన ఎరువుని కలిపేయాలి. నీళ్లలో సులువుగా కరిగే ఎన్‌పీకేను ప్రతి పదిహేను రోజులకోసారి అందిస్తే సరి.

* వేలాడే కుండీల్లో తక్కువ శ్రద్ధ పెట్టినా...చక్కగా ఎదిగే మొక్కలను నాటుకోవాలి. పిటూనియా, గడ్డి గులాబీ, ఇంగ్లిష్‌ ఐవీ వంటి రకాలను ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్