తక్కువ స్థలంలో తెలివిగా...

పూర్వంలా విశాలమైన ఇళ్లకు ఇప్పుడు పెద్దగా ఆస్కారం లేదు. ఉన్న కొద్ది స్థలంలో సామానంతా నింపేస్తే గజిబిజిగా ఉంటుంది. నడవటానికి కూడా వెసులుబాటు ఉండదు.

Published : 15 May 2023 00:38 IST

పూర్వంలా విశాలమైన ఇళ్లకు ఇప్పుడు పెద్దగా ఆస్కారం లేదు. ఉన్న కొద్ది స్థలంలో సామానంతా నింపేస్తే గజిబిజిగా ఉంటుంది. నడవటానికి కూడా వెసులుబాటు ఉండదు. అపార్ట్‌మెంట్స్‌లో మరీ కష్టం. బరువెక్కువైన కొద్దీ పిల్లర్స్‌ మీద భారం పెరుగుతుంది. దీర్ఘకాలంలో ప్రమాదాలకూ అవకాశం ఉంది. ఈ ఇబ్బందుల వల్లేనేమో ఇటీవలి కాలంలో మల్టీ పర్పస్‌ ఫర్నిచర్‌కి ఆదరణ పెరిగింది.  ఒక వస్తువు రెండు మూడు విధాలుగా పనిచేయడం మంచి సంగతే కదూ!


స్లీపర్‌ సోఫా.. ఇది చూపులకు సింగిల్‌ సోఫాలా ఉంటుంది. కాళ్ల దగ్గర లోనికి ఉన్న భాగాన్ని ముందుకు లాగి రెండు దిండ్లు వేసుకుంటే చాలు వెనక్కు వాలి పడుకోవచ్చు.   ఎక్కువ స్థలం ఆక్రమించదు కూడా. దీన్ని మూడు రకాలుగా వాడుకోవచ్చు.


స్టెయిర్‌కేస్‌ స్టోరేజ్‌... రోజూ వాడని వస్తువులనేకం ఎత్తుమీద ఉన్న కబోర్డ్‌లోకి లేదా అటకల మీదికి చేరతాయి. అందమైన స్టెయిర్‌కేస్‌ ఏర్పాటు చేసుకుంటే పైనున్న వస్తువులను తీయడానికి అనువుగా ఉంటుంది. ఆ నిచ్చెన మెట్లను సొరుగుల్లా రూపొందించి అనేక వస్తువులను అందులో పెట్టేసుకోవచ్చు.


స్టాకబుల్‌ బెడ్స్‌... పిల్లలున్న ఇంట్లో రెండు మంచాలు అవసరమవుతాయి. అలాగే బంధువులు వచ్చినప్పుడు అదనంగా మంచం కావాలి. కానీ అన్ని కొంటే రోజూ అడ్డుగా ఉంటాయి. అందుకు పరిష్కారంగా స్టాకబుల్‌ బెడ్స్‌ అయితే ఒక దాని కింద ఒకటి ఒదిగిపోతుంది. అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. లేదంటే మంచం కిందే ఉంటుంది. కొంచెం గ్యాప్‌ ఎక్కువుండేలా చేయించుకుంటే కింది మంచం మీద దిండ్లూ, దుప్పట్లూ పెట్టేయొచ్చు కూడా.


ఫ్లోటింగ్‌ టేబుల్‌... మంచానికి ఒక పక్కగా ఫ్లోటింగ్‌ టేబుల్‌ను అమర్చితే రాసుకోవడానికి లేదా టీకప్పులు, స్నాక్స్‌ లాంటివి పెట్టుకోవడానికి సదుపాయంగా ఉంటుంది. అవసరం లేనప్పుడు కిందికి వేలాడుతుంది కనుక అడ్డుగా ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్