మొక్కలకు ఐస్‌ క్యూబ్స్‌

ఇంట్లో పెరుగుతున్న మొక్క అకస్మాత్తుగా చిగురించడం తగ్గుతుంది. నీటిని అందిస్తున్నా.. నిస్సత్తువగా కనిపిస్తుంది. టేబుల్‌పైన కూజాలో పూలు వడిలిపోతుంటాయి.

Published : 26 May 2023 02:09 IST

ఇంట్లో పెరుగుతున్న మొక్క అకస్మాత్తుగా చిగురించడం తగ్గుతుంది. నీటిని అందిస్తున్నా.. నిస్సత్తువగా కనిపిస్తుంది. టేబుల్‌పైన కూజాలో పూలు వడిలిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటిని చిటికెలో తాజాగా మార్చేయొచ్చు. ఎలాగంటారా.. చదివేయండి!

నీటిలో పెరిగే ఇండోర్‌ మొక్క వేర్లు కొన్నిసార్లు రంగు మారుతుంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని రోజుల్లో అది చనిపోవచ్చు. ఆ ప్రమాదం రాకుండా.. రెండు కప్పుల నీటిలో పావు చెంచాలో సగం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి మొక్కకు అందించాలి. దీంతో వేర్లు సాధారణ వర్ణానికి రావడమే కాకుండా మొక్కా ఆరోగ్యంగా ఎదుగుతుంది.

క్యూబ్స్‌ ద్వారా.. తగిన పోషకాలు అందక ఇండోర్‌ మొక్క చిగురించడం తగ్గుతుంది. ఇటువంటప్పుడు కప్పు బియ్యంలో రెండు కప్పుల నీళ్లు పోసి నాననివ్వాలి. గంట తర్వాత ఈ నీటిని వడకట్టి ఐస్‌ ట్రేలో నింపి ఫ్రీజర్‌లో ఉంచాలి. నీటికి బదులుగా ఈ కడుగు ఐస్‌క్యూబ్‌ను తొట్టెలో ఉంచుతుండాలి. ఐస్‌ కరుగుతూ.. మొక్కకు కావాల్సిన పోషకాలు నెమ్మదిగా అందుతాయి. నాలుగైదు రోజులపాటు వరుసగా వీటిని ఇలా అందిస్తే మొక్కకు తిరిగి తాజాదనం వస్తుంది.

కీటకాలకు దూరంగా.. డైనింగ్‌ టేబుల్‌పై ఉంచే మొక్కల చుట్టూ చిన్నచిన్న కీటకాలు తిరుగుతుంటాయి. నారింజ తొక్క ముక్కలను నీటిలో మునిగేలా రెండు రోజులు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి రెట్టింపు నీటిని కలిపి స్ప్రే సీసాలో నింపి మొక్కలపై చల్లితే కీటకాల బెడద తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్