Published : 19/08/2021 02:47 IST

మనసుకు నచ్చితేనే..

లలిత చదువుతూనే కెరీర్‌ను ఎంచుకునే పనిలో ఉంది. అయితే తానెంచుకున్న రంగం నుంచి వెనుతిరగకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక సందిగ్దంలో పడిపోయింది. ఈ తరహా అంశంపై కొన్ని సూచనలిస్తున్నారు కెరీర్‌ నిపుణులు.

కొత్త ఆలోచనలకు... మనసులో వచ్చే ఆలోచనలకు ముందుగా ప్రాధాన్యతనివ్వడం నేర్చుకోవాలి. ఫలానా రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందనే సందేహంతో కొట్టుమిట్టాడకూడదు. అనుకున్న రంగానికి సంబంధించిన వ్యక్తులను కలిసి కొత్త విషయాలను తెలుసుకోవాలి. దాని గురించి సమగ్ర వివరాలను సేకరించాలి. అప్పుడే ప్రారంభమవుతున్న రంగంలో ఎదుగుదల ఉండదని భావించకూడదు. పెనుమార్పునకు ఈ రంగమే కారణమవచ్చు. అందుకే ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా ఆలోచించండి.

వైఫల్యంపై... కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు ముందుగానే వైఫల్యం గురించి ఆలోచించకూడదు. అపజయం కూడా విజయానికి మొదటిమెట్టు అని నిపుణుల అనుభవాలే చెబుతున్నాయి. అనుభవాలను పాఠాలుగా చేసుకుని ముందడుగు వేయగలిగే మానసిక బలాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

సామర్థ్యాలు... ఎంచుకున్న రంగానికి కావాల్సిన సామర్థ్యాలు మీకు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. లేదంటే వాటిని పెంచుకోవాలి. దానికి సంబంధించిన కోర్సులు చేస్తే మంచిది. ఆ రంగంలో అనుభవజ్ఞులను సంప్రదించి వారి అనుభవాలను అడిగి తెలుసుకోవాలి తప్ప, వారి అభిప్రాయాన్ని పూర్తిగా అనుసరించకూడదు. అవతలి వారికి అనుకూలంగా లేకపోయినా, మీ సామర్థ్యానికి మీరు అందులో అడుగుపెట్టి విజయం సాధించగలరేమో అనే దిశగా ఆలోచించాలి.

సౌకర్యం... ఏ నిర్ణయం తీసుకున్నా, మీ మనసుకు నచ్చినదై ఉండాలి. ఇష్టపడితేనే కష్టాలెదురైనా నిలబడగలుగుతారు. అంతేకాకుండా, కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. దానికి తగిన సృజనాత్మకతను పెంచుకోవాలి. ఎదురుపడిన చిన్న సమస్యను కూడా ఛాలెంజ్‌గా తీసుకోగలిగితే మీలో ఉత్సాహం కలిగి, ముందడుగు వేయగలుగుతారు. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా ఉండటానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే చాలు. మీరే ద బెస్ట్‌ అవుతారు. కెరీర్‌లో సక్సెస్‌ పొందుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి