కొత్తలో బాగానే ఉండి...

ఉద్యోగంలో చేరిన కొత్తలో రమ్యకు అంతా బాగానే ఉండేది. ఆరు నెలలయ్యేసరికి పనిపై ఆసక్తి తగ్గింది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మానేయాలనుకంటోంది. చదువుకు తగిన, మనసుకు నచ్చిన కెరియర్‌ను వదిలి పెట్టాలంటే వేదనగానూ ఉందామెకు.

Updated : 28 Oct 2021 06:10 IST

ఉద్యోగంలో చేరిన కొత్తలో రమ్యకు అంతా బాగానే ఉండేది. ఆరు నెలలయ్యేసరికి పనిపై ఆసక్తి తగ్గింది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మానేయాలనుకంటోంది. చదువుకు తగిన, మనసుకు నచ్చిన కెరియర్‌ను వదిలి పెట్టాలంటే వేదనగానూ ఉందామెకు. దీనికి కారణం కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సాహం లేకపోవడమే అంటున్నారు కెరియర్‌ నిపుణులు. ఇలాంటి వాళ్లు పాటించాల్సిన నియమాలనూ సూచిస్తున్నారు.

ఉత్సాహం... చదువు పూర్తయిన వెంటనే అనుకున్న ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది. తాను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి తెలుసుకున్నప్పుడు వాటినెలాగైనా సాధించగలమనే నమ్మకం ఉంటుంది. తీరా అక్కడికి అడుగుపెట్టేసరికి వాస్తవం ఎదురవుతుంది. తెలియని అంశాలెన్నింటినో సాధించాల్సి ఉంటుంది. వాటిపై అవగాహనాలేమి నిరుత్సాహానికి లోను చేస్తుంది. ఆసక్తి తగ్గడానికి ఇది మొదటి మెట్టు అవుతుంది.


మూస పద్ధతి... రోజూ ఒకే పని, ఒకే పద్ధతిలో చేస్తూ ఉండాలంటే చాలా మందికి త్వరగా నిరాసక్తత మొదలవుతుంది. మూస పద్ధతితో కొత్తలో ఉన్న ఉత్సాహం క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. కొత్తదనం కనిపించని పనితీరు, రోబోలా మెదడుతో ప్రమేయం లేకుండా బాధ్యతలు నిర్వర్తించే వారికి అక్కడి నుంచి వైదొలగాలనే ఆలోచనలు మొదలవుతాయి. ఇది తీవ్ర ఒత్తిడికి దారి తీస్తుంది. దాంతో చేసే పనిలో నాణ్యత ఉండదు.


ప్రతిరోజు... ముందుగా నచ్చిన కెరియర్‌ ఆ తర్వాత ఇష్టంగా లేదంటే దానికి కారణం మీరూ కావొచ్చు. ఈ ఆలోచన నుంచి బయటపడాలంటే ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను సంపాదించడం ముఖ్యం. అలాగే రోజూ ఉత్సాహంగా పని ప్రారంభించడం ఉద్యోగంపై ఆసక్తిని పెంచుతుంది. బాధ్యతలను ప్రేమిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు వినూత్నంగా చేయడానికి ప్రయత్నించాలి. ఉదయం ఆఫీస్‌కు వచ్చేటప్పటికే ఆ రోజు పూర్తిచేయాల్సిన అంశాలపై అవగాహన ఉండటం, పనులన్నీ వేగంగా అవడానికి ప్రయత్నించడం చేస్తే ఆ పనిలో నాణ్యత ఉంటుంది. అప్పుడు పై అధికారుల నుంచి దక్కే ప్రశంసలు తిరిగి ఉత్సాహాన్ని నింపుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్