ఉన్నతికి సోపానాలు

తన క్షేమసమాచారం పుట్టింటికి రాసేంత అక్షరజ్ఞానం చాలన్న పాతతరం మాటల్ని పట్టించుకోక చదువుల్లో రాణిస్తున్నారు ఆడపిల్లలు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు చిరుద్యోగంతో సరిపెట్టుకోక అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు.

Updated : 02 Nov 2021 06:07 IST

తన క్షేమసమాచారం పుట్టింటికి రాసేంత అక్షరజ్ఞానం చాలన్న పాతతరం మాటల్ని పట్టించుకోక చదువుల్లో రాణిస్తున్నారు ఆడపిల్లలు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు చిరుద్యోగంతో సరిపెట్టుకోక అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు. ఇంతకీ అంచెలంచెలుగా అందలాలు ఎక్కుతూ విజయ బావుటాలు ఎగరేయడం ఎలాగంటారా?! ఈ సూత్రాలను పాటించమంటున్నారు కెరీర్‌ కౌన్సిలర్లు
చేసే పని రొటీన్‌గా, మొక్కుబడిగా చేయొద్దు. ఇతరులు చేసిన దానికంటే మెరుగ్గా చేసేందుకు ప్రయత్నించండి. అదే మీకు గుర్తింపునూ గౌరవాన్నీ ఇస్తుంది.
* పని మానేసి కబుర్లతో కాలక్షేపం చేస్తే యాజమాన్యం సహించదు అనుకోకండి. నిజానికి ఆ తీరు మనకే నచ్చకూడదు. అప్పుడే మనం పనిని గౌరవిస్తున్నట్టు.
* తోటివాళ్లతో పోల్చుకోకండి. మీకు మీరే పోటీ. మీ కలలూ, లక్ష్యాల దిశగా సాగండి.
* చేస్తున్న పనిలో అన్నీ తెలుసు, సంపూర్ణ జ్ఞానిని అనుకోవద్దు. నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండండి. ఆ తృష్ణే మిమ్మల్ని మున్ముందుకు నడిపిస్తుంది.
* ప్రతిదీ ప్రదర్శన కాకున్నా, గుర్తింపు కూడా అవసరమే. మీరు నిశ్శబ్దంగా చేస్తూ పోతే క్రెడిట్‌ మరెవరికో దక్కొచ్చు. కనుక అధికారులకు మీ వర్క్‌ రిపోర్ట్‌ అందజేయండి.
* మీలో ఎన్ని నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్నా ఒక్కోసారి తప్పిదాలు జరగొచ్చు. అలాంటప్పుడు జరిగిన పొరపాటుకు క్షమించమని అడగండి. అది మీమీద గౌరవం పెంచుతుందే తప్ప ఎవరూ కించపరచరు. ఆ పొరపాట్లు కూడా మీకు పాఠాలు నేర్పుతాయి.
* పని చేసేటప్పుడు విసుగ్గా అసహనంగా ఉంటే ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. అదే ఇష్టంగా చేస్తే బరువూభారం అనిపించదు.
* అంకితభావంతో పని చేస్తున్నాం కదాని, లంచ్‌ సమయాన్ని వెనక్కు జరపొద్దు. వేళకు తినడం కూడా చాలా అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్