ప్రపంచ పోటీలకు పంజాబీ సుందరి!

మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీలకు మన దేశం నుంచి పోటీపడుతోంది హర్నాజ్‌ సంధు. 17 ఏళ్లకే ఫ్యాషన్‌ రంగంలో కాలుపెట్టి దూసుకుపోతున్న ఈ పంజాబీ భామ గురించి చదివేయండి.

Updated : 25 Nov 2021 05:36 IST

మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీలకు మన దేశం నుంచి పోటీపడుతోంది హర్నాజ్‌ సంధు. 17 ఏళ్లకే ఫ్యాషన్‌ రంగంలో కాలుపెట్టి దూసుకుపోతున్న ఈ పంజాబీ భామ గురించి చదివేయండి.
హర్నాజ్‌కు బాల్యం నుంచీ మోడలింగ్‌పై ఆసక్తి. వెండితెరపై మెరవాలనుకునేది. విద్యార్థి దశలోనే సినిమాలపై దృష్టిపెట్టి, పంజాబీ చిత్రాల్లో అవకాశాన్నీ దక్కించుకుంది. మోడల్‌గానూ ఎన్నో వేదికలపై మెరిసింది. ఆ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొంది. ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్నీ సొంతం చేసుకుంది. ఇది అంత సులువు కాలేదంటుంది హర్నాజ్‌.

‘ఇదో పెద్ద ఛాలెంజ్‌. ఈ పోటీలకు సిద్ధం కావడానికి 45 రోజులు మాత్రమే ఉండటంతో నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడ్డా. గెలుపే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నా. నా కృషి వృథా కాలేదు. మన దేశం తరఫున ‘మిస్‌ యూనివర్స్‌-2021’కు పోటీ చేసే అవకాశం దక్కింది. నేనూ విజయాన్ని సాధించి దేశం గర్వపడేలా చేస్తా’ అని చెబుతోన్న 21 ఏళ్ల హర్నాజ్‌ టీనేజ్‌లో చాలా అవమానాలను భరించింది. పీలగా ఉంటావంటూ విమర్శలు, హేళనలు ఎదుర్కొంది. అయినా ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకుండా, విమర్శించిన వారికి విజయంతోనే సమాధానం చెబుతానంటోందీమె. గతంలో సుస్మితాసేన్‌ (1994), లారాదత్తాలు (2000) మాత్రమే ఈ కిరీటాన్ని సాధించారు. అమ్మాయిలకూ చదువూ చాలా ముఖ్యం అంటోంది తను. అందుకే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నా అని చెబుతోంది. ఈ పోటీలకు త్వరలో ఇజ్రాయెల్‌ వెళ్లనున్న హర్నాజ్‌కి ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్