ఇలా చేస్తే.. ఫలితం సులువే

ఏదైనా కష్టమనిపించినప్పుడే పక్కన పెట్టేయాలనిపిస్తుంది. వ్యాయామమైనా అంతే! ఈ ఏడాది తీర్మానాల్లో వ్యాయామాన్ని జోడించుకుని ఉంటే.. వీటినీ గమనించుకోండి.

Published : 10 Jan 2022 01:27 IST

ఏదైనా కష్టమనిపించినప్పుడే పక్కన పెట్టేయాలనిపిస్తుంది. వ్యాయామమైనా అంతే! ఈ ఏడాది తీర్మానాల్లో వ్యాయామాన్ని జోడించుకుని ఉంటే.. వీటినీ గమనించుకోండి.

* ఇల్లైనా, ఆఫీసైనా.. ఎక్కువ శాతం కూర్చొనే పనులు చక్కబెట్టుకుంటుంటాం. ఇక నుంచి ఈ విధానానికి స్వస్తి పలకండి. దీనివల్ల గుండె, రక్తప్రసరణ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయట. కాబట్టి, ఎక్కువగా కదలడానికి, నడకకి ప్రాధాన్యమివ్వండి. గంటకోసారి కుర్చీలోనే కూర్చొని లేవడం, కిందకి, పైకి, పక్కకు వంగడం వంటివి చేయండి. ఇదీ వ్యాయామమే!

* ఒకే తరహా వ్యాయామాలూ విసుగు కలిగిస్తాయి. మూడు నెలలకోసారి కొత్తవి ప్రయత్నించండి. కొద్ది దూరాలకీ బండి తీయకండి. నడుస్తూ వెళ్లండి.

* పోషకాహారాన్నీ జత చేస్తేనే వ్యాయామం సంపూర్ణమయ్యేది. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నట్స్‌, పాలు, చేపలు లాంటివి ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్