ప్రణాళిక ఉందా?

ముందురోజు రాత్రే మరుసటి రోజుకు కావాల్సిన దుస్తులను సిద్ధం చేసుకోవాలి. అలాగే వంటకు సంబంధించి కూడా. ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. కొత్తలో ఇబ్బందిగానే ఉన్నా తర్వాత అలవాటుగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగలరు.

Published : 15 Feb 2022 02:00 IST

ఉద్యోగిగా ఉన్నత స్థానానికి ఎదగాలంటే చేసే పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. అప్పుడే  క్రమంగా ఉన్నతస్థాయికి చేరగలుగుతారు...

ముందురోజు రాత్రే మరుసటి రోజుకు కావాల్సిన దుస్తులను సిద్ధం చేసుకోవాలి. అలాగే వంటకు సంబంధించి కూడా. ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. కొత్తలో ఇబ్బందిగానే ఉన్నా తర్వాత అలవాటుగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాల్సిందే. ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగిగా మీకు మరింత సమాచారం తెలిసి ఉండటం కూడా ముఖ్యమే. కాబట్టి రోజూ ఓ అరగంట వార్తాపత్రికలు తిరగేయడమో, వార్తలు చూడటమో చేయండి.

జాబితా ఉందా...  ఆ రోజు చేయాలనుకునే పనుల జాబితాను మొదటే రాసుకుంటే రోజులో ఏం చేయాలనేదానిపై  స్పష్టత ఉంటుంది. ఉద్యోగినులకు ఇది చాలా అవసరం కూడా. ఆ జాబితా ముఖ్యమైన పనులతో చిన్నగా ఉండేలా చూసుకోవాలి.

ఏదైనా తర్వాతే.. ఎన్ని పనులున్నా... కార్యాలయానికి నిర్దేశించిన సమయానికి కల్లా వచ్చేయాలి. ఇది ఉద్యోగిగా పాటించాల్సిన మొదటి విధి. వచ్చాక టీ, కాఫీలంటూ, సహోద్యోగులతో మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయొద్దు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా... ఆఫీసుకు వచ్చాక కేవలం పని మీదే దృష్టి సారించాలి. అప్పుడే మీరు బాధ్యత గల ఉద్యోగి అవుతారు. పనుల్లో కూడా ఏ పని అత్యవసరమో తెలుసుకుని ముందుగా దాన్ని పూర్తి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని