కనురెప్పల సోయగంలో...

ఇప్పుడు మేకప్‌లో ఫాల్స్‌ ఐలాషెస్‌ కూడా భాగం. వీటిని అతికించుకుంటే కనురెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. కళ్లూ విశాలంగా అనిపించి ముఖానికి రెట్టింపు అందాన్నిస్తాయి. అయితే ఇవి కంటి ఆకారానికి తగ్గవే ఎంచుకోవాలి.

Updated : 25 Mar 2022 05:40 IST

ఇప్పుడు మేకప్‌లో ఫాల్స్‌ ఐలాషెస్‌ కూడా భాగం. వీటిని అతికించుకుంటే కనురెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. కళ్లూ విశాలంగా అనిపించి ముఖానికి రెట్టింపు అందాన్నిస్తాయి. అయితే ఇవి కంటి ఆకారానికి తగ్గవే ఎంచుకోవాలి. మార్కెట్‌లో 3, 4 రకాల్లో దొరుకుతున్నాయి. సహజ వెంట్రుకలు లేదా సింథటిక్‌ ఫైబర్‌తో రూపొందుతున్నాయి. ఏవి మీ ముఖానికి సరిపోతాయో చూసుకొని తీసుకోవాలి.

ట్రిమ్‌ చేస్తే.. ఫాల్స్‌ ఐలాషెస్‌ను ప్యాకెట్‌ నుంచి తీసి నేరుగా కంటికి అతికించద్దు. వాటి పొడవును మీ కంటికి సరిపోయేలా మార్చుకోవాలి. ఇందుకోసం వాటిని ముందుగా బయటివైపు నుంచి సున్నితంగా ట్రిమ్‌ చేయాలి. కనురెప్పలపై ఐలైనర్‌ వేసుకుని, ఆపై ఈ ఫాల్స్‌ ల్యాషెస్‌ వచ్చేలా చూసుకోవాలి. అది రెప్పలపై సమానంగా ఉందా లేదా గమనించాలి. సరిగా ఉన్నాయనిపిస్తే ఇయర్‌ బడ్‌ను జిగురులో ముంచి మృదువుగా కనురెప్పలపై అద్దాలి. అతుకు కనిపించకుండా మరో సారి పెన్సిల్‌ వేసుకుని చివరగా మస్కారాతో కర్ల్‌ చేస్తే సహజంగా అనిపిస్తాయి.

అలర్జీలకు దూరంగా.. జిగురు కంటికి అలర్జీలను కలిగిస్తుందేమో చూసుకోండి. అతికించేటప్పుడు అది కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. వీగన్‌, లేటెక్స్‌ ఫ్రీ, హైపో అలర్జనిక్‌ వంటి జిగుర్లను ఎంచుకోవాలి. తొలగించేప్పుడూ ఐ మేకప్‌ రిమూవర్‌ను వాడాలి. మరోసారి ఆయిల్‌తో కంటిపైనా తుడిచి, శుభ్రం చేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్