ఒత్తిడిని తరిమికొట్టేయొచ్చు...

ఒత్తిడి... మూడక్షరాల పదమే కానీ తెగ కలవరపెడుతుంది. మామూలు అనారోగ్యమైతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలా కాదు, అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది. శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి ఒత్తిడితో బాధపడే బదులు దాన్నెలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం...

Published : 23 Jun 2022 02:11 IST

ఒత్తిడి... మూడక్షరాల పదమే కానీ తెగ కలవరపెడుతుంది. మామూలు అనారోగ్యమైతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలా కాదు, అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది. శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి ఒత్తిడితో బాధపడే బదులు దాన్నెలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం...

* ఒత్తిడికి ఉత్తమ థెరపీ శారీరక వ్యాయామం. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను ఎవరినైనా తీసుకోండి... క్రమం తప్పక వ్యాయామం చేస్తారు. తమ టెన్షన్లకు ఉపశమనం అదేనంటారు.

* ఇంటా బయటా పనులెక్కువై తీరిక లేకున్నా సరే.. రోజులో కనీసం అరగంట సమయాన్ని మీకంటూ కేటాయించుకోండి. ఆ కాసేపూ మొహమాటం పక్కన పెట్టి మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి.. దుస్తులు, అలంకరణ ఏదైనా సరే! పాడాలనుకుంటే శ్రుతిలయల్లో ప్రవేశం లేదని సంకోచించకుండా పాడేయండి. నృత్యం అయినా అంతే. మార్కులూ, సర్టిఫికెట్ల కోసం కాదుగా సొంత ఆనందం కోసం చేస్తున్నాననుకోండి. ఇంకాస్త వెసులుబాటు ఉంటే మీకు నచ్చే అంశాలకు సంబంధించిన పుస్తకం చదవండి.

* మనసుకు కలిగిన ఎలాంటి దుఃఖాలైనా ఆప్తులతో చెబితే వాటి సాంద్రత లేదా తీవ్రత తగ్గుతుంది. కనుక ‘నా విషయాలు నాకే సొంతం’ అని దాచిపెట్టుకోకుండా ఇష్టమైన వ్యక్తితో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడిక ఒత్తిడికి తావుండదు.

* సెల్‌ఫోను, టీవీ గొప్ప కాలక్షేపం అనుకునే వారిలో మీరు కూడా చేరారా? ఆ కాలక్షేపం చేయకూడనంత చెడు చేసి చోద్యం చూస్తుందని అర్థం చేసుకోండి. అందులో మెదడు నరాలకు ఒత్తిడి కలిగించడం ఒకటి. ఇంత అనర్థాన్ని కొనితెచ్చుకోవడమా.. వాటిని దూరం పెట్టడమా... నిర్ణయం మీదే!

* యాంత్రికతను ఛేదించండి. ఎంతసేపూ పనుల్లో మునిగితేలక కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పండి. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లిరండి. లేదా వాళ్లను మీ ఇంటికి ఆహ్వానించండి. కాసేపు ఏ పార్కుకో షికారుగా వెళ్లిరండి. ఇలాంటివి ఒత్తిడి తగ్గించడమే కాదు ఆనందాలు నింపుతాయి.

* రింగు, వాలీబాల్‌, కబడ్డీ లాంటి ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడండి. కుదరకపోతే చదరంగం, క్యారమ్స్‌ లాంటి ఇండోర్‌ గేమ్స్‌ ఆడండి. ఆటలు ఒత్తిడిని దూరంచేసి ఉల్లాసాన్ని అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్