మీపై మీకు విశ్వాసం ఉందా...

ఈ ప్రశ్న అడిగినప్పుడు ఉంది అని సమాధానమిస్తాం. అయితే ఏదైనా సమస్య ఎదురై, పరిష్కారాన్ని వెతికేటప్పుడే మనపై మనకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సమస్య జఠిలంగా ఉండి,

Published : 09 Sep 2022 00:53 IST

ఈ ప్రశ్న అడిగినప్పుడు ఉంది అని సమాధానమిస్తాం. అయితే ఏదైనా సమస్య ఎదురై, పరిష్కారాన్ని వెతికేటప్పుడే మనపై మనకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సమస్య జఠిలంగా ఉండి, ప్రయత్నం వృథా అయ్యి, వైైఫల్యం ఎదురైనప్పుడు ఆత్మన్యూనత మొదలవుతుంది. ఆ సమయంలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అంటున్నారు నిపుణులు.

ఇంటి నిర్వహణ, కెరియర్‌లో సమస్యలు వచ్చినప్పుడు ఎదుటి వారు ‘పాజిటివ్‌గా ఆలోచించు’.. ‘ఈ సమస్య శాశ్వతం కాదు’ అని చెబుతుంటారు. వాటిని విన్నప్పుడు నిజమనిపించదు. అయితే ఎవరు చెప్పినా సానుకూల ఆలోచనాధోరణితో ఉండటం మంచిది. ఇబ్బందులెదురైనప్పుడు ఇక అవతలి గట్టు లేదని డీలా పడిపోకూడదు. ఎలాగైనా పరిష్కరించే మార్గం ఉంటుందనే కోణంలో అడుగులేయాలి. సమస్యను అధిగమించగలమనే ఆలోచనే మెదడుకు కొత్త శక్తినిస్తుంది. ప్రతికూలతకు దూరంగా ఉండటం అలవాటు చేస్తుంది.

ఒంటరినని  భావిస్తే..
పరిష్కరించలేననే సమస్యలెదురైనప్పుడు ఒంటరిననే భావం మొదలవుతుంది. ఇది మిమ్మల్ని మరింత బలహీనపరుస్తుంది. అటువంటి సమయంలో మీ శక్తిని ఇతరులను సంతోషపెట్టే పనికి ఉపయోగించాలి. అందులోంచి పొందే ఆనందం, తృప్తి మనసును ఉత్సాహపరుస్తుంది. ప్రతికూల ఆలోచనలు క్రమేపీ దూరమవుతాయి. ఇతరుల కోసం మీరూ పనిచేయగలరనే ఆలోచన ఆనందాన్నివ్వడమే కాదు, మీ మనసుకు నచ్చిన పని తృప్తినీ.. అందిస్తుంది. దాంతో పాటు మీ సమస్యకు కారణమైన వాటిని కూడా గుర్తించగలిగే స్థాయికి చేరుకుంటారు. వాటిని ఛేదించి బయటకు రాగలిగే శక్తిని పొందుతారు. మీకేం కావాలి, ఏది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది వంటి అంశాలన్నీ తెలుసుకుంటారు. అవే మిమ్మల్ని ఒంటరిననే భావం నుంచి దూరం చేస్తాయి.


గతం స్ఫూర్తిగా..

ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు గతంలో మీరు సాధించిన విజయాలను ఓ పట్టికలా రాయాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత, క్లిష్టమనుకున్న క్రీడలో అడుగుపెట్టి విజేతగా నిలవడం వంటివన్నీ ఒక పుస్తకంలో రాయాలి. వాటిని చూస్తూ, ఆ సమయంలో వాటినెలా సాధించ గలిగారో గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు గర్వపడేలా చేసిన ఆ క్షణాలు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ నైపుణ్యాలు మీకు తెలుస్తాయి. నీవల్ల ఏదీ కాదు అని మనసు పదేపదే చెబుతూ, ఆత్మన్యూనత పెరుగుతుంటే దాన్ని అధిగమించగలగాలి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ మానసిక బలాన్నిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్