విడిచిపెట్టడం సెకన్ల పని.. కానీ!

న్యూయార్క్‌ ఎస్బీఐ విభాగంలో కొన్నేళ్లు పనిచేసి 2000లో తిరిగొచ్చా. లఖ్‌నవూలో పోస్టింగ్‌. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించారు. అక్కడ మా అమ్మాయికి మంచి స్కూల్‌ దొరకదనిపించింది. వేరే నగరానికి మార్చమన్నా అంగీకరించక పోవడంతో జాబ్‌ వదిలేయాలనుకున్నా.

Published : 15 Sep 2022 00:39 IST

న్యూయార్క్‌ ఎస్బీఐ విభాగంలో కొన్నేళ్లు పనిచేసి 2000లో తిరిగొచ్చా. లఖ్‌నవూలో పోస్టింగ్‌. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించారు. అక్కడ మా అమ్మాయికి మంచి స్కూల్‌ దొరకదనిపించింది. వేరే నగరానికి మార్చమన్నా అంగీకరించక పోవడంతో జాబ్‌ వదిలేయాలనుకున్నా. ఆ సమయంలో ఎస్బీఐ మాజీ ఛైర్మన్‌ సలహా కోసం ఫోన్‌ చేస్తే.. ‘విడిచిపెట్టడం సెకన్ల పని. కానీ కెరియర్‌లో కీలక దశ ముంగిట ఉన్నావు. కనీసం ప్రయత్నించకుండానే ఎందుకు వదిలేయడం?’ అన్నారు. దాంతో నా ఆలోచనని విరమించుకున్నా. ఇప్పటికీ ఏదైనా సందిగ్ధత ఎదురైనప్పుడు ఆయన మాటలే గుర్తొస్తాయి. ఉద్యోగం విడిచిపెట్టడం పని చేసే తల్లులకు కనిపించే మొదటి ఆప్షన్‌. కానీ పట్టుదలతో ఉంటే ఏదోక మార్గం కనిపిస్తుంది. కెరియర్‌లో మార్గదర్శి ఉంటే మేలనడానికి మరో ఉదాహరణ చెబుతా. ఎస్బీఐ ఛైర్మన్‌గా రిటైరవ్వడానికి ముందు సంవత్సరం విదేశాల్లో పనిచేయడానికి ఒక్క మహిళా ఉద్యోగీ దరఖాస్తు చేసుకోలేదు. తర్వాత ఏడాదంతా మహిళలకు మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహించా. మరుసటి ఏడాది అభ్యర్థుల్లో మూడో వంతు మహిళలే.

- అరుంధతీ భట్టాచార్య.. ఛైర్‌పర్సన్‌, సీఈఓ సేల్స్‌ఫోర్స్‌ ఇండియా, ఎస్బీఐ మాజీ ఛైర్మన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్