విరామం తర్వాత ఉద్యోగమా?

ప్రసవం తర్వాత కాస్త విరామం తీసుకుని... కెరియర్‌లోకి అడుగు పెట్టాలనుకునే అమ్మలు చాలామందే. ఈ గ్యాప్‌ కొన్ని సార్లు ఆత్మన్యూనతను కలిగిస్తుంది.

Published : 08 Nov 2022 00:17 IST

ప్రసవం తర్వాత కాస్త విరామం తీసుకుని... కెరియర్‌లోకి అడుగు పెట్టాలనుకునే అమ్మలు చాలామందే. ఈ గ్యాప్‌ కొన్ని సార్లు ఆత్మన్యూనతను కలిగిస్తుంది. తిరిగి నిలదొక్కుకోగలమో లేదో అన్న భయాన్ని పెంచుతుంది. ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాలో సూచిస్తున్నారు నిపుణులు.

*  కొత్తగా సిద్ధం అవ్వండి: గతంలో చాలా ఇంటర్వ్యూలకు హాజరై ఉండి ఉంటారు. కానీ, ఇదే మీ మొదటి ఇంటర్వ్యూ అనుకోండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండి. అవసరమైతే నిపుణుల సాయంతో శిక్షణ తీసుకోండి. సీనియర్ల సలహాలూ స్వీకరించండి.

* మీ ప్రత్యేకత ఏంటి?:  ఒక్క ఉద్యోగం కోసం వందలాది మంది రావొచ్చు. అంత మందిలో మీ ప్రత్యేకత తెలిసేదెలా? అందుకే ఉద్యోగ ప్రయత్నాల కంటే ముందే మీ నైపుణ్యాలను సరి చూసుకోండి. అప్‌టుడేట్‌గా ఉండటానికి కొత్త ఉద్యోగానికి కావలసిన అదనపు అర్హతలపై పట్టు తెచ్చుకోండి. ఇందుకు అవసరమైన శిక్షణ తీసుకోవడమో లేదా కోర్సులో చేస్తే మరీ మంచిది. వాటిని రెజ్యుమె లో ప్రత్యేకంగా ప్రస్తావించండి. అప్పుడు మీరే మాత్రం భయం లేకుండా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించొచ్చు. 

* ఆత్మవిశ్వాసం అవసరం: కొంత విరామం తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు ఆందోళన సహజమే. అలాగని ప్రయత్నించకుండా భయపడటం అనవసరం. మీ గత విజయాలను గుర్తుతెచ్చుకోండి. భవిష్యత్తులో బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే ఉద్యోగం చేయాల్సి రావొచ్చు. అందుకు మీరేవిధంగా సన్నద్ధమయ్యారో, సమన్వయం చేసుకోగలరో కూడా చెప్పాల్సి రావొచ్చు. కాబట్టి వాటన్నింటికీ సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పగలిగితే వెనకడుగు వేయనక్కర్లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్