నిద్రమత్తు వదలడం లేదు..
నా వయసు 25, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఎత్తు 160సెం.మీ. బరువు 48కేజీలు. అల్పాహారంగా దోశ, ఇడ్లీ తీసుకుంటా. సమయం లేనప్పుడు అదీ తినను.
నా వయసు 25, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఎత్తు 160సెం.మీ. బరువు 48కేజీలు. అల్పాహారంగా దోశ, ఇడ్లీ తీసుకుంటా. సమయం లేనప్పుడు అదీ తినను. ఇక, రెండు పూటలా అన్నం-కూర, అప్పుడప్పుడూ పెరుగు తింటుంటా. లంచ్ తర్వాత నిద్ర ఎక్కువగా వస్తోంది. ఆపడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ఇటీవలే థైరాయిడ్ పరీక్షలూ చేయించుకుంటే లేదన్నారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్లే నిద్రమత్తు అని చెబుతున్నారు. సమతులాహారం ఎలా తీసుకోవాలో సూచించరూ...
- భవానీ, అమలాపురం
రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోవడం వల్ల శరీరం అలసిపోయి, నిస్సత్తువగా మారుతుంది. ముందు ఎందువల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుందో తెలుసుకుని పరిష్కరించుకోండి. పనివేళల్లో ఆవలింతలు, నిద్ర రావడానికి ఇదీ ఒక కారణం. అల్పాహారాన్ని దాటవేస్తున్నా అంటున్నారు. వీటన్నింటికీ తోడు మధ్యాహ్నం అన్నం తింటున్నారు. ఎంత మోతాదులో తీసుకుంటున్నారో చెప్పలేదు. సాధారణంగా... అన్నంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటన్నింటి ప్రభావం శరీరం మీద పడుతోంది. శక్తి మొత్తం జీర్ణవ్యవస్థ పనిచేయడానికే సరిపోతోంది. దాంతో నిద్రమత్తు ఆవరిస్తోంది. దీని నుంచి బయటపడాలంటే కచ్చితమైన డైట్ ప్లాన్ సిద్ధం చేసుకొని, క్రమం తప్పకుండా పాటించాలి. సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మీరు ఎత్తుకు తగ్గ బరువు లేరు. కొంచెం పెరగాలి. తరచూ అల్పాహారం తినడం మానేస్తే దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి చేటు. తప్పనిసరిగా టిఫిన్ చేయాలి. త్వరగా అరిగిపోయే దోశ, ఇడ్లీ కాకుండా.. ఓట్స్ ఉప్మా, జొన్న ఇడ్లీ, ఎగ్ శాండ్‌విచ్, చపాతీ, పనీర్ పరోటా లాంటివి తినాలి. లంచ్‌లో సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. పుల్కా, కూర, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు కలిపి చేసిన రోటీలూ తినొచ్చు. ఇవేమీ కాకుండా అన్నం తినాలనుకుంటే ఒకటిన్నర కప్పుల రైస్, కూరలు తినాలి. మీల్‌మేకర్‌ను కూరల్లో భాగం చేసుకుంటే మంచిది. రాత్రి పూటా ఇదే తరహా ఆహారం తీసుకోవాలి. పండ్లు, నట్స్, సలాడ్‌లూ స్నాక్స్‌లా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.