మండుతోందా.. వీటిని తాగేయండి!

నెలసరి సమీపిస్తున్నప్పుడూ, కొందరిలో ప్రెగ్నెన్సీ సమయంలో అసిడిటీ పలకరిస్తుంటుంది. ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే లేవడం, వేళకు తినకపోవడం.. ఇలా దీనికి ఎన్ని కారణాలో.  ఉపశమనం కోసం

Updated : 06 Apr 2022 01:26 IST

నెలసరి సమీపిస్తున్నప్పుడూ, కొందరిలో ప్రెగ్నెన్సీ సమయంలో అసిడిటీ పలకరిస్తుంటుంది. ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే లేవడం, వేళకు తినకపోవడం.. ఇలా దీనికి ఎన్ని కారణాలో.  ఉపశమనం కోసం చూస్తున్నారా?

* ముల్లంగి రసంలో కాస్త తేనె కలిపి తాగి చూడండి. దీనిలోని ఫైబర్‌ అసిడిటీకి చెక్‌ పెట్టడంతోపాటు అజీర్తి, మల బద్ధక సమస్యలనూ దూరం చేస్తుంది.

* పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి, వడకట్టి చల్లార్చి లేదా పుదీనా రసాన్ని నేరుగా చల్లని నీటిలో కలిపి అయినా తాగండి. ఆసిడ్‌ల ఉత్పత్తిని నిరోధించడంతోపాటు కడుపులో మంటనీ తగ్గిస్తుంది.

* గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర, వామును రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. కొద్ది రోజులు రోజూ ప్రయత్నిస్తే మెటబాలిజంతోపాటు జీర్ణప్రక్రియా మెరుగుపడుతుంది.

* గ్యాస్‌ పట్టినట్టుగా అనిపిస్తే చల్లని పాలు తాగేయండి. దీనిలో ఉండే కాల్షియం కడుపులో ఆసిడ్‌ల ఉత్పత్తిని తగ్గించడమే కాక త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది.

* మలబద్ధకం, పొట్టపట్టినట్లుగా అనిపిస్తోంటే పాలల్లో గులాబీ రేకలను మరిగించి, తాగండి. ఉపశమనం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్