దీక్షాధారులకు ‘సహర్‌’ సాయం

రంజాన్‌... ముస్లింలకు పవిత్ర మాసం. ఈ మాసంలో ప్రతిఒక్కరూ ఉపవాస దీక్ష(రోజా) చేయాలనుకుంటారు. తెల్లవారు జామున సెహరీ ముగించుకుని నిష్ఠగా రోజా ఉండాల్సి ఉంటుంది. కానీ, ఆ సమయంలో

Published : 03 May 2022 01:22 IST

రంజాన్‌... ముస్లింలకు పవిత్ర మాసం. ఈ మాసంలో ప్రతిఒక్కరూ ఉపవాస దీక్ష(రోజా) చేయాలనుకుంటారు. తెల్లవారు జామున సెహరీ ముగించుకుని నిష్ఠగా రోజా ఉండాల్సి ఉంటుంది. కానీ, ఆ సమయంలో ఆహారం లభించక ఎందరో ఉపవాస దీక్షలకు దూరంగా ఉండటం గమనించిన ఖాలిదా పర్వీన్‌ వారికి భోజనం అందిస్తున్నారు.

పేదలూ, హోటల్‌ భోజనం ఇష్టంలేని వాళ్లూ, విద్యార్థినీ విద్యార్థులూ పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాసం చేయాలనుకుంటారు. కానీ వారిలో కొందరికి ఉదయాన్నే ఆహారం అందక ఉపవాసం చేయలేకపోవడాన్ని గమనించారు ఖాలిదా పర్వీన్‌. అప్పట్నుంచీ అలాంటి వారికి ఉచితంగా భోజనాలు అందిస్తున్నారు. ఈమె ఉండేది హైదరాబాద్‌లోని ఖాదర్‌బాగ్‌లో. టోలిచౌకిలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడే వంటలు చేస్తుంటారు. రోజూ రాత్రి 10 గంటలకి వాలంటీర్ల సాయంతో బగారా, దాల్చాతోపాటు కాబూలీ పులావ్‌, కిచిడి, అన్నం-సాంబారు... ఇలా ఏదో ఒక  శాకాహారాన్ని వండి అందిస్తారు. అర్ధరాత్రి రెండింటికల్లా ఆహార ప్యాకెట్లు సిద్ధం చేసి హాస్టళ్లలో ఉండే విద్యార్థినులు, సెక్యురిటీ గార్డులు, వాచ్‌మన్‌లు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు వాటిని అందజేస్తారు. విద్యార్థులు స్వయంగా వీరి వద్దకు వచ్చి తీసుకెళ్తుండగా, మిగిలిన వాళ్లకి వాలంటీర్ల సాయంతో అందజేస్తారు. గత రెండేళ్లు కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రంజాన్‌ మాసంలో రోజూ 500 మందికి ఆహారం అందించగా, పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో ఇప్పుడు రోజూ 200 మందికి పంపిణీ చేస్తున్నామంటున్నారు. తమ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి పొందిన వాలంటీర్లు ఆహారం తయారీ, పంపిణీలో సాయపడగా, దాతలు ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెబుతారు పర్వీన్‌. కరీంనగర్‌ జిల్లా రేకుర్తికి చెందిన స్నేహితురాలు పేదల కోసం సెహరీ ఉచితంగా అందించడం చూసి తానూ స్ఫూర్తిపొందానంటారు. డీఫార్మసీ చేసిన పర్వీన్‌.. 60 ఏళ్లపడిలోనూ చురుకైన సామాజిక కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల కిందట ‘అమూమత్‌(అమ్మలాంటిది) సొసైటీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్