కేన్సర్‌తో పోరాడే పుట్టగొడుగులు!

పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉంటాయన్నది మనకు తెలిసిందే. దీంట్లో ఉండే లెంటినన్‌ అనే రసాయనం క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతుందని న్యూయార్క్‌ మెమోరియల్‌ స్లోన్‌ కెట్టెరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌ చేసిన అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా రొమ్ము

Updated : 30 Sep 2021 04:14 IST

పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉంటాయన్నది మనకు తెలిసిందే. దీంట్లో ఉండే లెంటినన్‌ అనే రసాయనం క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతుందని న్యూయార్క్‌ మెమోరియల్‌ స్లోన్‌ కెట్టెరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌ చేసిన అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ బాధితులు వీటిని ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నియంత్రించడమే కాకుండా, కొత్త కణాలను నిరోధించడానికి వీటిలోని ఔషధగుణాలు పోరాడతాయని తెలిసింది. కీమోథెరపీ పొందే వారికి ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో క్యాన్సర్‌ కణితుల పెరుగుదల తగ్గుముఖం పడుతుంది. శరీరంలోని వైరస్‌ను నశింపజేసే శక్తి లెంటినన్‌కు అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందే డీ విటమిన్‌ను పుట్టగొడుగు నుంచి కూడా పొందొచ్చు. ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరానికి అందించే బీ12 విటమిన్‌ ఇందులో పుష్కలంగా ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, గ్లూటాథియోన్‌ వృద్ధాప్యచాయలను దూరం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్