నానమ్మ ఆస్తిలో మనవలకి వాటా రాదా?

మాకు పెళ్లై పదేళ్లు అయ్యింది. ఇద్దరాడపిల్లలు. ఈ మధ్య నా భర్త ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మా మామగారు ఇరవైఏళ్ల క్రితమే చనిపోయారు.

Updated : 23 Jan 2024 12:12 IST

మాకు పెళ్లై పదేళ్లు అయ్యింది. ఇద్దరాడపిల్లలు. ఈ మధ్య నా భర్త ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మా మామగారు ఇరవైఏళ్ల క్రితమే చనిపోయారు. అత్త, పెళ్లికాని మరిది మాత్రమే ఉన్నారు. అత్తపేరున రెండెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. మనవలకైనా సరే! ఏదీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసిందావిడ. పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇచ్చేలా ఆ ఆస్తి నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందా?

మీ పరిస్థితి బాధాకరం. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 14 ప్రకారం అది ఆవిడ స్వార్జితం అవుతుంది. మీ భర్త ఉద్యోగం ఏమైనా చేశారా? దాన్నుంచి మీకు ఏమీ రాలేదా? మీరు జాబ్‌ చేయడం లేదా? మీ పిల్లలకు, మీకు జీవనభృతి కోసం గృహహింస చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు పెళ్లప్పుడు ఇచ్చిన కట్నకానుకలు తిరిగి ఇమ్మని గృహహింస చట్టంలోని సెక్షన్‌ 20 కింద మెయింటెనెన్స్‌ అడగొచ్చు. మీ అత్తగారు అనుభవిస్తోన్న ఆస్తిలో నుంచి మెయింటెనెన్స్‌ కోరవచ్చు.  మీకు రావాల్సిన కట్నం తాలూకు డబ్బు, మీ పెళ్లప్పుడు ఇచ్చిన కానుకలు, మీ భర్త సంపాదించిన ఆస్తులేవైనా ఉంటే ఈ చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం వాటి తాలూకు ఆధారాలు చూపించి తిరిగి ఇవ్వమని అడగండి. వీటన్నింటికంటే ముందు మీకు దగ్గర్లోని మధ్యవర్తిత్వ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు ఇవ్వండి. వాళ్లు పిలిపించి చెప్పి చూస్తారు. ఒప్పుకోకపోతే అప్పుడు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వారిని సంప్రదిస్తే లాయర్‌ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు కోర్టులోనే తేల్చుకోవచ్చు. ఏదైనా సరే త్వరగా నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్