హులాహూప్‌తో మస్తీ!

ఇప్పుడు జిమ్‌లకు, పార్కులకు వెళ్లి వ్యాయామం చేసే పరిస్థితి లేదు. ఇంట్లోనే కదలకుండా కూర్చుంటే అనారోగ్యాలు చుట్టుముట్టొచ్చు. అలాకాకూడదంటే... ఉత్సాహాన్నిచ్చే వ్యాయామాలు ప్రయత్నించండి. అలాంటి వాటిలో ఈ మధ్య హూలాహూప్‌కి ఆదరణ పెరిగింది

Published : 18 Jun 2021 01:06 IST

ఇప్పుడు జిమ్‌లకు, పార్కులకు వెళ్లి వ్యాయామం చేసే పరిస్థితి లేదు. ఇంట్లోనే కదలకుండా కూర్చుంటే అనారోగ్యాలు చుట్టుముట్టొచ్చు. అలాకాకూడదంటే... ఉత్సాహాన్నిచ్చే వ్యాయామాలు ప్రయత్నించండి. అలాంటి వాటిలో ఈ మధ్య హూలాహూప్‌కి ఆదరణ పెరిగింది. మరి దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా?
ఏరోబిక్స్‌లో భాగమైన ఇది కెలొరీలు, కొవ్వుని సులువుగా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ కదలికలతో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. కండరాలనూ బలోపేతం చేస్తుంది.
*  నడుము, పిరుదుల భాగం నాజూగ్గా ఉండాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక. వీటిని డ్యాన్స్‌తో కలగలిపి చేస్తే... ఉత్సాహంగానూ చేయగలుగుతారు. ఇంటిల్లిపాదీ కలిపి అడుగులు వేస్తే... వ్యాయామం సరదాగా గడిచిపోతుంది.
*  ఈ రింగుతో వ్యాయామం వల్ల గుండె, వెన్ను బలపడతాయి. ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. చిన్నారులతో ఈ సాధన చేయిస్తే సరి. చదువులపై దృష్టిపెట్టగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్