పచ్చని కానుక... ఇవ్వండి

నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. స్నేహితులకు, తోబుట్టువులకు మంచి కానుక ఇవ్వాలనుకుంటున్నారా? పుట్టినరోజుకి వారికి నచ్చిందేదైనా అందించా లనుకుంటున్నారా. అలాగైతే స్వయంగా మీరే చేసివ్వండి.

Published : 22 Dec 2022 00:31 IST

నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. స్నేహితులకు, తోబుట్టువులకు మంచి కానుక ఇవ్వాలనుకుంటున్నారా? పుట్టినరోజుకి వారికి నచ్చిందేదైనా అందించా లనుకుంటున్నారా. అలాగైతే స్వయంగా మీరే చేసివ్వండి. అవతలి వారు మొక్కల ప్రేమికులైతే.. మీరిచ్చిన కానుకలో పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తే చాలు.

ఏ తరహా మొక్కను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారో ముందుగా ఎంచుకోవాలి. వెదురు, మనీప్లాంట్‌, టేబుల్‌ రోజ్‌ వంటి ఇండోర్‌ ప్లాంట్‌కు ప్రాముఖ్యతనిస్తే మంచిది. ఎందుకంటే మీ కానుక నిత్యం వారెదురుగానే ఉంటుంది. తొట్టె పరిమాణంబట్టి దానికి తగిన జూట్‌బ్యాగ్‌ను తీసుకోవాలి. దానిపై వారి పేరు లేదా అభినందనలను అక్షరరూపంలో వర్ణభరితమైన దారాలతో కుట్టాలి. ఆ తర్వాత తొట్టె చుట్టూ గమ్‌రాసి దానిపై బ్యాగును అతికించి అంచులను మడవాలి. బ్యాగు లోపల కానుకలా కనిపించే మొక్కను అమర్చి వారికి అభినందనలు చెబుతూ అందించేయండి.



బర్త్‌డేకు.. మట్టి తొట్టెకు సరిపడా ముదురువర్ణం ప్లాస్టిక్‌ లేదా సెరామిక్‌ తొట్టెను తీసుకోవాలి. ఇందులో మొక్క ఉన్న తొట్టె నుంచి, మొక్కకు రెండు వైపులా మట్టిలో చివర్ల మెరిసే నక్షత్రాలను అంటించిన రెండు పుల్లలను గుచ్చాలి. వీటి చివర్లను కలుపుతూ.. హ్యాపీ న్యూఇయర్‌ అనో బర్త్‌ డే అనో అక్షరాల తోరణాన్ని కడితే చాలు. ఈ తోరణాలను అందమైన గాజు తొట్టెలో ఉంచిన పుల్లలకు కూడా ఏర్పాటు చేయొచ్చు. ఇది వారి మనసు కచ్చితంగా దోచుకుంటుంది.


జంటకు.. ప్రేమికుల జంట లేదా భార్యాభర్తలకు కలిపి కానుకివ్వాలంటే ముందుగా వారి ఫొటోను హృదయాకారంలో కట్‌చేసి అందమైన ఆకారంలో ఉండే లేతవర్ణపు పింగాణీ తొట్టెకు అంటించాలి. దానికి చుట్టూ లేత గులాబీ వర్ణంలో హార్ట్‌లా డిజైన్స్‌ వేయాలి. లేదంటే కాఫీ కప్పులపై ఫొటోలుండేలా చేసి ఇస్తున్నారు. అలా ముందుగా తయారు చేసి కూడా దీనికి సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడీ తొట్టెలో మట్టి నింపి వారికిష్టమైన మొక్కనుంచి ఇస్తే చాలు. అలాగే చిన్న చిన్న పింగాణీ లేదా సెరామిక్‌ తొట్టెల్లో మట్టి నింపి కాక్టస్‌ లేదా టేబుల్‌ ప్లాంట్స్‌ను వేయాలి. ఈ తొట్టెపై మీ మనసులోని మాటలను పెయింట్‌తో రాసి అందించేయండి. ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఈ తొట్టెలు అందంగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్