రొమ్ముల్లో పాల గడ్డలు రాకుండా ఏం చేయాలి?

హలో డాక్టర్‌. మా పాపకు 20 నెలలు. నేను తనకు పాలు మాన్పించాలనుకుంటున్నా. అయితే నా రొమ్ముల్లో పాల గడ్డలు రాకుండా ఉండాలంటే ఏ మాత్రలు వాడచ్చు? ఇవి కాకుండా సహజసిద్ధమైన మార్గాలేమైనా ఉన్నాయా? - ఓ సోదరి

Published : 26 Jan 2022 12:17 IST

హలో డాక్టర్‌. మా పాపకు 20 నెలలు. నేను తనకు పాలు మాన్పించాలనుకుంటున్నా. అయితే నా రొమ్ముల్లో పాల గడ్డలు రాకుండా ఉండాలంటే ఏ మాత్రలు వాడచ్చు? ఇవి కాకుండా సహజసిద్ధమైన మార్గాలేమైనా ఉన్నాయా? - ఓ సోదరి

జ: ఏ దశలో అయినా సరే పాలివ్వడం మొదలుపెట్టాక.. తిరిగి ఆపేసినప్పుడు కొద్ది రోజులు రొమ్ములు గట్టిపడడం, నొప్పిగా ఉండడం సహజమే! ఏ మాత్రలు వాడినా కూడా ఒకసారి మొదలైన లాక్టేషన్‌ మీద ప్రభావం చూపలేవు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని కారణాల వల్ల కాన్పు జరిగిన వెంటనే అసలు పాల తయారీ మొదలు కాకుండా ఉండాలంటే Cabergolin అనే మాత్రలు కొద్ది రోజుల పాటు వాడచ్చు. ఒకసారి పాలివ్వడం మొదలుపెట్టాక ఇవి కూడా పనిచేయవు. అయితే పూర్తిగా పాలివ్వడం మానేసిన తర్వాత నొప్పి తగ్గడానికి కొద్ది రోజులు పారాసిటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవడం, కాపడం పెట్టుకోవడం, చక్కటి ఆసరా ఇచ్చే బ్రా వేసుకోవడం.. వంటివి చేస్తే రెండుమూడు రోజుల్లో ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్