ఊరు మారితే పిరియడ్స్ పైన ప్రభావం ఉంటుందా?

హలో డాక్టర్‌. నాకు ముప్పయ్యేళ్లు. మూడేళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా ముంబై షిఫ్టయ్యాను.  అప్పట్నుంచి నాకు పిరియడ్స్‌ వచ్చాక రెండు రోజులే బ్లీడింగ్‌ అవుతోంది. ఇదేమైనా సమస్యా? దీనివల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుందా? ఉండే ప్రదేశం మారితే పిరియడ్స్...

Published : 20 Sep 2022 21:19 IST

హలో డాక్టర్‌. నాకు ముప్పయ్యేళ్లు. మూడేళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా ముంబై షిఫ్టయ్యాను.  అప్పట్నుంచి నాకు పిరియడ్స్‌ వచ్చాక రెండు రోజులే బ్లీడింగ్‌ అవుతోంది. ఇదేమైనా సమస్యా? దీనివల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుందా? ఉండే ప్రదేశం మారితే పిరియడ్స్ పైన కూడా ప్రభావం ఉంటుందా? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: మీ సమస్యకు ప్రదేశంలో మార్పు, అక్కడి వాతావరణంలో మార్పు కొంతవరకు కారణం కావచ్చు. కానీ ఇతరత్రా ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని వివరాలు కావాలి. బరువు పెరిగారా?, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైందా? అన్న విషయాలు కూడా తెలియాలి. ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్‌ టెస్టులు చేయించుకుంటే హార్మోన్ల అసమతుల్యత ఉందేమో అర్థమవుతుంది. ఒకవేళ రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉంటే గర్భం రావడానికి ఇది సమస్య కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్