గుడ్డు పెంకులతో.. ఒత్తైన జుట్టు!

గుడ్డు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అయితే గుడ్డు పెంకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. ప్రత్యేకించి జుట్టు ఎదుగుదలకు, చర్మం బిగుతుగా ఉండడానికి సైతం ఇవి ఉపయోగిస్తాయంటున్నారు నిపుణులు.

Published : 18 Jan 2024 13:24 IST

గుడ్డు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అయితే గుడ్డు పెంకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. ప్రత్యేకించి జుట్టు ఎదుగుదలకు, చర్మం బిగుతుగా ఉండడానికి సైతం ఇవి ఉపయోగిస్తాయంటున్నారు నిపుణులు.

బిగుతైన చర్మానికి..

కారణమేదైనా చర్మం సాగిపోవడం వల్ల ముడతలు పడడం, గీతల్లా ఏర్పడడం సహజం. ఇవే మనల్ని వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి, ఈ సమస్యల్ని దూరం చేసుకొని తిరిగి చర్మాన్ని బిగుతుగా మార్చుకోవాలంటే గుడ్డు పెంకులతో ఈ ఫేస్‌ప్యాక్‌ ప్రయత్నించచ్చంటున్నారు నిపుణులు.

గుడ్డు పెంకుల పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ తేనె, టేబుల్‌స్పూన్‌ పాలు, కొద్దిగా గులాబీ నీరు.. వీటన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బీటర్‌ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాటన్‌ బాల్‌ను ముంచి కింది నుంచి పైకి, బయటి నుంచి లోపలి వైపుకి అప్లై చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

ఒత్తైన జుట్టుకు..

జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలోనూ గుడ్డు పెంకులు సహకరిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని గుడ్డు పెంకుల పొడిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో సరిపడా పెరుగు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించి పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌ కుదుళ్లకు బలాన్ని చేకూర్చి జుట్టు ఎదుగుదలను ప్రేరేపించడంతో పాటు కేశాలకు మెరుపును తీసుకొస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్