చెమట పొక్కులకు చెక్‌ పెట్టండిలా..!

వేసవిలో చెమట పొక్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి బయటపడాలంటే ఖరీదైన సౌందర్యోత్పత్తులు వాడే కంటే సహజంగా దొరికే పదార్థాలతోనే సులభంగా నయం...

Published : 03 May 2023 18:25 IST

వేసవిలో చెమట పొక్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి బయటపడాలంటే ఖరీదైన సౌందర్యోత్పత్తులు వాడే కంటే సహజంగా దొరికే పదార్థాలతోనే సులభంగా నయం చేసుకోవచ్చు.

కలబంద..

చెమట పొక్కులు వచ్చిన ప్రాంతంలో కలబంద గుజ్జు రాయాలి. దీనిలో యాస్ట్రింజెంట్‌ గుణాలు అధికం. ఇవి చెమట పొక్కుల్నే కాదు.. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తాయి. కలబంద శరీరంలో వేడిని బయటకు పంపి చల్లదనాన్నిస్తుంది. ఈ గుజ్జుకు పసుపు కలిపినా మరింత ప్రయోజనం ఉంటుంది.

టీట్రీ ఆయిల్..

దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. చెమట పొక్కులు విపరీతంగా వేధించినప్పుడు టీట్రీ ఆయిల్‌ని నీళ్లలో కలిపి అందులో దూదిని ముంచాలి. ఆ దూదిని కాసేపయ్యాక తీసుకొని చెమట పొక్కుల మీద తుడవాలి. చేతులతో నూనె రాయడం వల్ల ఇన్ఫెక్షన్‌ ఎక్కువవుతుంది. అలా కాకుండా దూదితో రాస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.

ఐసు ముక్కలు..

ఈ సమస్యకు కోల్డ్‌ కంప్రెసర్‌ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ట్రేలో నీటిని నింపి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత తయారైన ఐసు ముక్కల్ని మెత్తని వస్త్రంలోకి తీసుకొని చెమట పొక్కుల మీద నెమ్మదిగా నొక్కినట్లు అద్దాలి. మూడు నాలుగు గంటలకోసారి ఇలా చేయడం వల్ల పొక్కులు త్వరగా తగ్గిపోతాయి. వాటి వల్ల వచ్చే నొప్పి, మంట కూడా అదుపులో ఉంటాయి.

వెనిగర్..

కొన్నిసార్లు పొక్కుల వల్ల మంట కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు వెనిగర్‌ చక్కటి పరిష్కారం అందిస్తుంది. వైట్‌ వెనిగర్‌లో టిష్యూ కాగితాన్ని ముంచి చెమట పొక్కుల మీద పరవాలి. కాగితం నుంచి వెనిగర్‌ను చర్మం గ్రహించాక తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఆ సమస్య తగ్గడమే కాదు.. ఎంతో హాయిగానూ అనిపిస్తుంది.

లావెండర్‌ నూనె..

కొన్నిసార్లు చెమట పొక్కులు నొప్పిగా అనిపిస్తాయి. అలాంటప్పుడు లావెండర్‌ నూనెలో ముంచిన దూదితో ఆ ప్రాంతంలో మర్దన చేస్తున్నట్లు రాయాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే ఉపశమనం కలుగుతుంది. నొప్పి కూడా ఉండదు.

బ్లాక్‌ టీ..

కొందరికి బ్లాక్‌ టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఈ టీని కాసేపు ఫ్రిజ్లో ఉంచి, తీసి సమస్య ఉన్న చోట రాస్తే చెమట పొక్కుల బెడద తగ్గుతుంది. చర్మం మీద అందుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉన్నా వెంటనే నశిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్