నాజూకు నడుముకు..

మనలో కొందరికి నిద్ర సరిగా పట్టదు. ఇంకొందరికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటుంది. ఇంకొందరు స్థూలకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అర్ధ మత్స్యాసనం ప్రయత్నించండి.

Published : 25 Mar 2023 00:26 IST

మనలో కొందరికి నిద్ర సరిగా పట్టదు. ఇంకొందరికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటుంది. ఇంకొందరు స్థూలకాయంతో బాధపడుతుంటారు. ఇలాంటి అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అర్ధ మత్స్యాసనం ప్రయత్నించండి..

ఇలా చేయాలి...

మొత్తం శరీరమంతా సౌఖ్యంగా, సదుపాయంగా ఉండేలా కూర్చుని కాళ్లను తిన్నగా ముందుకు చాపాలి. ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి. అంటే కుడి కాలి పాదం ఎడమ మోకాలి వద్ద నేలమీద ఉంటుంది. వెన్నెముక నిటారుగా బిగపట్టినట్టు కాకుండా రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి. మొదట్లో ఇలా చేయడం కష్టమనిపిస్తే కంగారుపడొద్దు. కొన్ని రోజుల తర్వాత చేయడం తేలికవుతుంది. వీపు పై భాగాన్ని కుడివైపునకు తిప్పండి. మీకు వీలైనంత వరకూ మాత్రమే చేయండి. కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ శరీరమంతటినీ సౌఖ్యంగా ఉంచుతూ ఈ భంగిమలో కొన్ని నిమిషాలు ఉండి నెమ్మదిగా యథాస్థితికి రండి. ఇదే విధంగా రెండో కాలితో చేయండి.

ఇవీ ప్రయోజనాలు...

* నిద్రలేమికి చెక్‌ పెట్టొచ్చు.

* పొట్ట, నడుము దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

* ఊబకాయం నుంచి బయటపడి సన్నగా, నాజూగ్గా ఉండొచ్చు.

* హృద్రోగాలు, టైప్‌-2 డయాబెటిస్‌, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, ఆస్టియోఆర్థరైటిస్‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. నీ ఉబ్బసం లాంటి శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి.

* వెన్నెముక బలంగా ఉంటుంది. నడుం నొప్పి రాదు. నీ శరీరమంతా దృఢంగా తయారవుతుంది.

ఎవరు చేయకూడదు..

* జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవాళ్లు, వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నవాళ్లు, గర్భిణీలు ఈ ఆసనం జోలికి వెళ్లకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్