నా అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలు పోవాలంటే ఏం చేయాలి?

హాయ్‌ మేడం. నా వయసు 30. నా నుదురు, గడ్డం, పెదాలపై నల్లగా ఉంటుంది. ఈ నలుపు తగ్గి ముఖమంతా ఒకే రంగులోకి రావాలంటే ఏం చేయాలి? అలాగే నా అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలున్నాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి? పరిష్కారం చూపగలరు. - ఓ సోదరి

Published : 04 Dec 2021 16:45 IST

హాయ్‌ మేడం. నా వయసు 30. నా నుదురు, గడ్డం, పెదాలపై నల్లగా ఉంటుంది. ఈ నలుపు తగ్గి ముఖమంతా ఒకే రంగులోకి రావాలంటే ఏం చేయాలి? అలాగే నా అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలున్నాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి? పరిష్కారం చూపగలరు. - ఓ సోదరి

జ. ముందుగా అప్పర్‌లిప్‌పై ఉండే అవాంఛిత రోమాల్ని వ్యాక్సింగ్‌ ద్వారా తొలగించుకోవాలి. ఆపై రోమాలు త్వరగా పెరగకుండా ఉండేందుకు ఇంట్లో లభించే పదార్థాలతో ప్యాక్‌ తయారుచేసుకొని ఉపయోగించచ్చు. ఇందుకోసం అర టేబుల్‌స్పూన్‌ పసుపు, టేబుల్‌స్పూన్‌ పెరుగు, అర టేబుల్‌స్పూన్‌ బియ్యప్పిండి.. ఈ మూడింటినీ ప్యాక్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వ్యాక్స్‌ చేసుకున్న ప్రదేశంలో అప్లై చేసుకొని పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేసినట్లయితే అవాంఛిత రోమాలు త్వరగా రాకుండా ఉంటాయి.

ఇక నుదురు, గడ్డం, పెదాలపై నల్లగా ఉందని రాశారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే బంగాళాదుంప ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం.. బంగాళాదుంపను బాగా కడిగి తొక్క చెక్కేయాలి. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్‌ తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ జారుడుగా ఉంటే అర టేబుల్‌స్పూన్‌ శెనగపిండి లేదా అర టేబుల్‌స్పూన్‌ బార్లీ పౌడర్‌ వేసుకొని మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయాలి. తద్వారా ముఖంపై ఉండే నల్లదనం తగ్గిపోయి ముఖమంతా ఒకే రంగులోకి మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్