అసమానతలపై కాంచీ పోరు!

పదిహేడేళ్ల కాంచీ చోప్రాది దిల్లీ... వయసు చూస్తే చిన్నదే..కానీ ఆమె నిర్వహించే బ్లాగుని మాత్రం ముప్ఫై దేశాల వారు అనుసరిస్తుంటారు. ఇంతకీ దాని ద్వారా తనే చెప్పాలనుకుంటుందని మీకు సందేహం రానే వచ్చింది కదా! ఆ...అక్కడికే వస్తున్నాం...నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న ఎందరో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సలుపుతోందామె.

Updated : 08 Dec 2022 20:29 IST

దిహేడేళ్ల కాంచీ చోప్రాది దిల్లీ... వయసు చూస్తే చిన్నదే..కానీ ఆమె నిర్వహించే బ్లాగుని మాత్రం ముప్ఫై దేశాల వారు అనుసరిస్తుంటారు. ఇంతకీ దాని ద్వారా తనే చెప్పాలనుకుంటుందని మీకు సందేహం రానే వచ్చింది కదా! ఆ...అక్కడికే వస్తున్నాం...నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న ఎందరో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సలుపుతోందామె. తనకు వచ్చిన చిత్రకళకు అదనంగా అందమైన వాక్యాలను చేర్చి ‘ఆర్టివిజమ్‌’ అనే పేరుతో ప్రజల ను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తోంది. ఇంత చిన్న వయసులో...ఇలా నీకెవరు స్ఫూర్తి అంటే ఆమె చెప్పే పేర్లు...నైజీరియా దేశానికి చెందిన స్త్రీవాదులైన ఎలాన్‌ మస్క్‌, చిమామాండా నగోజీ అదిక్‌లనే. అందరిలాంటి సగటు యువతి కాదు కాంచీ. తన వయసు వారిలా అందంపై....ఎప్పటికప్పుడు వచ్చే తాజా ట్రెండ్‌లపై ఆమెకసలు దృష్టేలేదు. వాటికి మించిన సమస్యలెన్నో అమ్మాయిలకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయన్నది కాంచీ భావన. అందుకే వాటిని రూపుమాపేందుకు తన శైలిలో ఆర్టివిజమ్‌ని ప్రచారం చేస్తోంది. వర్ణవివక్ష, లైంగిక అసమానత...ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు, దాడుల వంటి వాటిని రూపుమాపడానికి నిత్యం తన బ్లాగుద్వారా పోరాడుతోంది. ఆమ్ల దాడులకు సంబంధించిన ఒక్క చిత్రం ఆమె తన బ్లాగులో పోస్టు చేయగానే రెండు రోజుల్లోనే వేలమంది దాన్ని చదివేశారు. అమ్మాయిల మనుగడకోసం పోరాటం చేసే పలు స్వచ్ఛంద సంస్థలైన ‘‘స్టాప్‌ యాసిడ్‌ ఎటాక్స్‌’’, ‘‘షీరోస్‌ హ్యాంగవుట్‌’’, ‘‘మేక్‌ లవ్‌ నాట్‌ స్కార్స్‌’’ వంటివెన్నో ఆమె పోస్టులనూ పంచుకుంటున్నాయి. వర్ణవివక్షపై చేసిన ప్రచారానికి యూఎన్‌-ఎయిడ్స్‌ సంస్థ నుంచి అభినందనలూ అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్