మృదువైన అధరాల కోసం..

కొంతమందికి పెదవులు పొడిబారిపోయి.. అందవిహీనంగా తయారవుతాయి. కొన్నిసార్లు పెదవుల పైన చర్మం పగిలి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి కాపాడుకోవడానికి లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొంత సమయం మాత్రమే....

Published : 24 Jul 2022 10:38 IST

కొంతమందికి పెదవులు పొడిబారిపోయి.. అందవిహీనంగా తయారవుతాయి. కొన్నిసార్లు పెదవుల పైన చర్మం పగిలి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి కాపాడుకోవడానికి లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొంత సమయం మాత్రమే అధరాలు నిగారింపుగా కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలే. దీంతో మళ్లీ మళ్లీ వాటిని అప్త్లె చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా వాటిలోని రసాయనాల ప్రభావం పెదవులపై పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రోజంతా అధరాల్లో తేమ సహజసిద్ధంగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..

కలబందతో..

ఆరోగ్యం.. అందం.. రెండింటినీ కాపాడటంలో కీలకపాత్ర పోషించే కలబంద పెదవుల అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని పెదవులకు అప్త్లె చేసి కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదవులకు తగినంత తేమ అంది పొడిబారకుండా ఉంటాయి.

నెయ్యితో..

ఇంట్లో పెద్దవాళ్లు మన పెదవులు పొడిబారినట్లు గమనిస్తే 'నెయ్యి రాసుకో' అని సలహా ఇస్తూ ఉంటారు. ఆ క్షణం దాన్ని మనం పట్టించుకోకపోయినా.. పెదవుల మృదుత్వాన్ని కాపాడే వాటిలో నెయ్యి ముందు వరుసలో ఉంటుంది. అందులో ఉండే కొవ్వు పదార్థాలు అధరాలు పొడిబారకుండా కాపాడతాయి. ఈ ఫలితాన్ని పొందాలంటే రోజూ రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా పెదవులకు నెయ్యి రాసుకుంటూ ఉండాలి.

ఆవనూనెతో..

కొంతమందికి పెదవులు పొడిబారడంతో పాటు.. పగిలి నొప్పి పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆవనూనెను ఉపయోగించడం మంచిది. కొద్దిగా ఆవనూనె తీసుకొని పెదవులకు రాసుకోవాలి. దీన్ని అప్త్లె చేసుకున్నప్పుడు పెదవులు కొంత సమయం మంట పెడతాయి. కాస్త ఓపిక పడితే మాత్రం మంచి ఫలితం కనిపిస్తుంది. అధరాలు తేమ సంతరించుకుని మృదువుగా తయారవడంతో పాటు నొప్పి కూడా తగ్గిపోతుంది.

తేనెతో..

రోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు కొద్దిగా తేనె రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారి నల్లగా మారిన పెదవులు తిరిగి తేమను సంతరించుకుంటాయి. ఫలితంగా పెదవులు మృదువుగా మారడంతో పాటు గులాబీ రంగుతో మరింత అందంగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్