Nail Art Trends: గోళ్లకు ‘కొత్త’ సొగసులు!

సౌందర్య పోషణలో భాగంగా గోళ్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందే. ఈ క్రమంలో మానిక్యూర్, ట్రిమ్మింగ్ వంటి ప్రక్రియలతో వాటి అందాన్ని కాపాడుకోవడమే కాదు.. నెయిల్ ఆర్ట్‌తోనూ వాటికి కొంగొత్త సొగసులద్దుతుంటాం. దీనికి సంబంధించి ఈ ఏడాది సరికొత్త ట్రెండ్స్....

Published : 04 Jan 2023 18:03 IST

సౌందర్య పోషణలో భాగంగా గోళ్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందే. ఈ క్రమంలో మానిక్యూర్, ట్రిమ్మింగ్ వంటి ప్రక్రియలతో వాటి అందాన్ని కాపాడుకోవడమే కాదు.. నెయిల్ ఆర్ట్‌తోనూ వాటికి కొంగొత్త సొగసులద్దుతుంటాం. దీనికి సంబంధించి ఈ ఏడాది సరికొత్త ట్రెండ్స్ సిద్ధమైపోయాయి. మరి అకేషన్ ఏదైనా ప్రత్యేకంగా, స్టైలిష్‌గా చూపించే ఆ నెయిల్ ఆర్ట్ ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం రండి..

‘పేస్టల్‌’తో పర్‌ఫెక్ట్‌ లుక్!

గోళ్లన్నింటికీ ఒకే రంగు నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం పాత ట్రెండ్‌. మిక్స్‌ అండ్‌ మ్యాచింగ్‌గా ఉండేలా ఒక్కో గోరుకు ఒక్కో రంగు వేసుకోవడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌. ఈ తరహా ఫ్యాషన్‌ ఫాలో అయ్యే వారు సాధారణ నెయిల్ పాలిష్‌కు బదులు పేస్టల్‌ షేడ్స్‌తో కూడిన నెయిల్‌ పాలిష్‌ను ఎంచుకోమంటున్నారు నిపుణులు. మరీ ముదురు రంగులో ఎబ్బెట్టుగా కాకుండా.. కంటికి ఆకర్షణీయంగా ఉండే ఈ రంగులు గోళ్లను మరింత ఇంపుగా కనిపించేలా చేస్తాయి. పైగా చర్మ ఛాయ కాస్త తక్కువగా ఉన్న వారికీ ఈ పేస్టల్ కలర్స్‌ ఇట్టే సూటవుతాయి. ఇందులోనూ మీ ఛాయకు తగినట్లుగా నీలం, ఆకుపచ్చ, లావెండర్‌, పసుపు పచ్చ.. వంటి రంగుల్ని ఎంచుకొని మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసుకోవచ్చు.. లేదంటే వ్యతిరేక రంగుల్లో ఉండే వాటితో మీకు నచ్చినట్లుగా నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోవచ్చు. ఇలా మీరు ఎంచుకున్న పేస్టల్‌ షేడ్స్‌ మిమ్మల్ని నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి.. పర్‌ఫెక్ట్‌ లుక్‌ని అందిస్తాయి.

మ్యాచింగ్‌.. మ్యాచింగ్!

వేసుకున్న దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ దాకా ప్రతిదీ మ్యాచింగ్‌గా ఉండాలనుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. నెయిల్‌ పాలిష్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దుస్తుల రంగును బట్టి వాటినీ ఎప్పటికప్పుడు మార్చుతూ స్టైలిష్‌గా మెరిసిపోతున్నారు. అయితే ఇప్పుడున్న ట్రెండ్‌ని బట్టి వీటిలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. అదెలా అనుకుంటున్నారా..? మీ దుస్తుల ప్రింట్స్‌కి తగినట్లుగా గోళ్ల పైనా ఆర్ట్‌ వేసుకుంటే.. మరింత మోడ్రన్‌గా మెరిసిపోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల నెయిల్‌ స్టాప్లింగ్‌ ప్యాలెట్స్‌ దొరుకుతున్నాయి. వాటితో ఎలాంటి ప్రింట్‌నైనా క్షణాల్లో గోళ్లపై వేసేసుకోవచ్చు. యానిమల్‌ ప్రింట్స్‌, కార్టూన్‌ తరహావి, ఫ్లోరల్ ప్రింట్స్‌, ఇతర బొమ్మల రూపంలో ఉన్నవి.. ఇలా మీ దుస్తులకు లేదంటే అభిరుచులకు తగినట్లుగా నెయిల్‌ ఆర్ట్‌ని తీర్చిదిద్దుకోవచ్చు. ఒకవేళ సొంతంగా మీకు నెయిల్‌ ఆర్ట్ వచ్చుంటే మీరే వేసేసుకోవచ్చు.. ఈ నైపుణ్యాల్ని ఉపాధిగానూ మలచుకోవచ్చు.

గ్లాసీ లుక్‌ కోసం..!

కొంతమంది మేకప్‌కు ఎంత ప్రాధాన్యమిస్తారో, గోళ్లూ అంతే హైలైట్‌ కావాలనుకుంటారు. ఈ క్రమంలోనే గ్లిట్టర్‌ నెయిల్‌ ఆర్ట్‌ని ఆశ్రయిస్తుంటారు. అయితే మరింత గ్లాసీ లుక్‌ని సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం.. గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌.. వంటి వివిధ రంగుల్లో తయారైన మెటాలిక్‌ నెయిల్‌ పాలిష్‌ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోంది. అద్దంలా మెరిసిపోయే ఈ నెయిల్‌ ఆర్ట్‌ మీ గోళ్లకు సరికొత్త లుక్‌ని అందిస్తుంది. అయితే ఇందులోనే కాస్త సింపుల్‌ లుక్‌ని కోరుకునే వాళ్లు.. గోళ్లకు సాధారణ నెయిల్‌ పాలిష్‌ వేసుకొని.. గోళ్ల అంచుల వద్ద దానికి మ్యాచింగ్‌గా ఉండే మెటాలిక్‌ పాలిష్‌తో హంగులద్దచ్చు. ఇక ఇందులోనూ మెర్మెయిడ్‌, జామెట్రిక్‌.. తరహా ప్రింట్స్‌తో గోళ్లను మరింత స్టైలిష్‌గా మార్చుకోవచ్చు.

సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా..!

అందం, ఫ్యాషన్‌ విషయాల్లోనూ కొందరు సింప్లిసిటీనే కోరుకుంటారు. నెయిల్‌ ఆర్ట్‌ విషయంలోనూ వారు ఇలాగే ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి మ్యాట్ తరహా నెయిల్‌ ఆర్ట్‌ చక్కగా నప్పుతుందంటున్నారు నిపుణులు. మెరుపులు వంటి అదనపు హంగులేమీ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుందీ నెయిల్‌ ఆర్ట్‌. వీటిలోనూ లేత రంగులతో పాటు ముదురు వర్ణాలూ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చర్మఛాయకు తగినట్లుగా ఆయా రంగుల్ని ఎంచుకుంటే కూల్‌ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇక మ్యాట్ తరహా నెయిల్‌ ఆర్ట్‌లోనూ విభిన్న ప్రింట్స్‌ని గోళ్లపై తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే ఈ నెయిల్‌ ఆర్ట్‌పై స్టోన్స్, పెర్ల్స్.. వంటివి తీరైన ఆకృతిలో అతికిస్తే మరింత క్యూట్‌గా మెరిసిపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్