చపాతీ కర్రే.. కాస్త వెరైటీగా!

కుకీస్‌, బిస్కట్లంటే పిల్లలకు భలే ఇష్టం. అయితే బయటి నుంచి వాటిని కొనడం ఇష్టం లేని తల్లులు ఇంట్లోనే స్వయంగా తయారుచేస్తుంటారు. అందులోనూ చాలామంది ప్లెయిన్‌ కుకీస్‌నే తయారుచేయడం చూస్తుంటాం.

Published : 21 Sep 2023 12:17 IST

కుకీస్‌, బిస్కట్లంటే పిల్లలకు భలే ఇష్టం. అయితే బయటి నుంచి వాటిని కొనడం ఇష్టం లేని తల్లులు ఇంట్లోనే స్వయంగా తయారుచేస్తుంటారు. అందులోనూ చాలామంది ప్లెయిన్‌ కుకీస్‌నే తయారుచేయడం చూస్తుంటాం. అదే కాస్త వెరైటీగా.. పిల్లలు మెచ్చేలా.. వివిధ డిజైన్లతో కూడిన ఎంబోస్‌డ్‌ కుకీస్‌ని తయారుచేసిస్తే.. లొట్టలేసుకొని మరీ తింటారు. అలాంటి వెరైటీ కుకీస్‌ తయారుచేసుకునేందుకే ‘ఎంబోస్‌డ్‌ రోలింగ్‌ పిన్స్‌’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చాయి.

వివిధ డిజైన్లతో చెక్కిన చపాతీ కర్రే ఇది. ఫ్లోరల్‌ ప్రింట్‌, వివిధ రకాల బొమ్మలు, జంతువుల బొమ్మలు, చెట్లు, పక్షులు, స్టార్స్‌, హార్ట్‌ సింబల్స్‌, అక్షరాలు.. వంటివన్నీ కర్రపై చెక్కినట్లుగా ఎంబోస్‌డ్‌ మాదిరిగా తీర్చిదిద్దిన ఈ కర్రలతో.. వివిధ ఆకృతుల్లో తయారుచేసిన కుకీస్‌ పైనుంచి ఒకసారి ప్రెస్‌ చేస్తే సరిపోతుంది. లేదంటే కుకీస్‌ కోసం సిద్ధం చేసిన పిండిని చపాతీలా తయారుచేసి.. ఆఖరుగా దానిపై ఈ రోలింగ్‌ పిన్‌ని దొర్లిస్తే మనకు కావాల్సిన డిజైన్లలో కుకీస్‌ తయారవుతాయి. ఆపై వాటిని చిన్న చిన్న కుకీస్‌గా కట్‌ చేసుకొని అవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు. ఇలా తక్కువ సమయంలోనే ఎన్నో వెరైటీ కుకీస్‌ని తయారుచేసుకోవచ్చు. ఇక ప్లెయిన్‌ చపాతీ బోర్‌ కొట్టిన వారూ ఈ ఎంబోస్‌డ్‌ చపాతీ కర్రలతో వివిధ డిజైన్లలో చపాతీ తయారుచేసుకొని ఆస్వాదించచ్చు. అతిథుల్నీ సర్‌ప్రైజ్‌ చేయచ్చు. మరి, ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే అలాంటి వెరైటీ చపాతీ కర్రలపై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్