సహజంగా మెరిసిపోండి!

చుట్టూ వేడుకల వాతావరణమే! సహజంగా అందంగా కనిపించా లనుకుంటాం. కేవలం మేకప్‌పైనే ఆధారపడితే ఎలా? సహజంగా మెరిసిపోండి!

Updated : 29 Dec 2022 00:21 IST

చుట్టూ వేడుకల వాతావరణమే! సహజంగా అందంగా కనిపించా లనుకుంటాం. కేవలం మేకప్‌పైనే ఆధారపడితే ఎలా? సహజంగా మెరిసిపోండి!

* ఈకాలం దాహంగా లేదని పట్టించుకోం కానీ.. తప్పక తరచూ నీటిని తాగాలి. శరీరంలోని మలినాలన్నీ బయటికి పోయి చర్మం కాంతులీనుతుంది. కావాల్సిన తేమా అందుతుంది.

* ఉదయాన్నే లేవడానికి కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. దొరికిన కొద్ది సమయాన్ని నిద్రకే కేటాయించాలనిపిస్తుంది. దాన్ని వదిలించుకొని చెమట చిందించండి. ఇంట్లోనే తిరగడం, నిలబడి జాగింగ్‌, ప్లాంక్‌, స్ట్రెచ్‌లు వంటివాటికి ఓ పావుగంట కేటాయించారంటే శరీరం దృఢంగా అవడమే కాదు.. ముఖమూ మెరుస్తుంది.

* చలి గాలులకు ముఖం పొడిబారుతుంటుంది. మృతకణాలు పేరుకుపోతుంటాయి. ఫలితమే నిర్జీవమైన ముఖం. రెండు మూడురోజులకోసారి శరీరమంతా మృదువుగా స్క్రబ్‌ చేయడం తప్పనిసరి చేసుకోండి. మృతకణాలు తొలగి చర్మానికి సహజ కాంతి వస్తుంది. తర్వాత ఏదైనా షీట్‌ లేదా ఇంట్లో చేసిన వాటితో మాస్క్‌ వేస్తే చర్మానికి కావాల్సిన పోషకాలూ అందుతాయి.

* ఉదయం, సాయంత్రం ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, చర్మతీరుకు తగిన మాయిశ్చరైజర్‌ రాయడం అలవాటుగా చేసుకోవాలి. ఎండలో బయటికి వెళుతోంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పక రాయాలి.

* నిద్ర శరీరానికి ఓ వరం. శరీరాన్ని మరమ్మతు చేసి ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. చర్మానికీ తాజాదనాన్ని అందిస్తుంది. వేళకి పడుకోవడం, కనీసం 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. మేకప్‌ అవసరం ఉండదంటే నమ్మండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్