Parenting: అలా మాట్లాడుతున్నారా?

పిల్లలు తెలియకుండానే కొన్ని మాట్లాడకూడని, అసభ్యకరమైన పదాలు పలికేస్తుంటారు. వీటిని స్కూల్లోనో, మరింకెక్కడో నేర్చుకుని ఉండి ఉండొచ్చు. అయినా సరే, దీనికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే అలవాటుగా మారే ప్రమాదం ఉంది.  

Published : 02 May 2023 00:13 IST

పిల్లలు తెలియకుండానే కొన్ని మాట్లాడకూడని, అసభ్యకరమైన పదాలు పలికేస్తుంటారు. వీటిని స్కూల్లోనో, మరింకెక్కడో నేర్చుకుని ఉండి ఉండొచ్చు. అయినా సరే, దీనికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే అలవాటుగా మారే ప్రమాదం ఉంది.  

అతి శ్రద్ధ వద్దు.. పిల్లలు చెడు మాటలు వాడుతున్నారని తెలియగానే కొట్టడమో, తిట్టడమో చేయకూడదు. వాళ్లపై అతిశ్రద్ధ పెట్టడమూ సరికాదు. ఇలా చేస్తే వాళ్లలో ఆందోళన పెరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. అంతేకాదు, భవిష్యత్తులో మనం వారి మాట వినాలనుకున్నప్పుడల్లా ఈ పదాలనే ఉపయోగిస్తారు. కాబట్టి అలా మాట్లాడటం తప్పని, దాని వల్ల గౌరవం ఉండదనీ, ఎదుటివారి ముందు చులకన అవ్వాలనే విషయం, నైతిక నియమాలూ అర్థమయ్యేలా చెప్పండి.

మంచి ప్రవర్తనతో.. పిల్లలు వారి కోపాన్ని బయటపెట్టడం కోసం కొన్నిసార్లు అదుపు తప్పి మాట్లాడేస్తుంటారు. ఈ ప్రవర్తనను ప్రోత్సహించకూడదు. ఉద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో ముందు నేర్పించాలి.

క్షమాపణలు.. చిన్నపిల్లలు వారి భావాలను పూర్తిగా వ్యక్తపరచలేకపోవచ్చు. వాళ్లకంటూ వ్యక్తిత్వం ఏర్పడే ఈ దశలో నేర్చుకోవటంలో కొన్ని తప్పులు చేయటం సహజమే. కానీ వాళ్లు తెలియక అన్నారని పట్టించుకోకుండా ఉండద్దు. ఎవరినైనా అలా చెడ్డ పదాలతో తిట్టినప్పుడు తప్పకుండా వారితో క్షమాపణలు చెప్పించాలి. అప్పుడే మరోసారి అనరు. ఇంట్లోనూ ఎవరూ ఇలాంటి భాష వాడకూడదు. చుట్టూ ఉండే వాతావరణమూ వారిపై ప్రభావం చూపిస్తుందని మరిచిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్