Friendship: స్నేహితులవ్వాలంటే

కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవాలన్నా, నలుగురిలో కలవాలన్నా కొందరిని బెరుకు, భయం వెంటాడుతుంటాయి. మరి మంచి స్నేహాబంధాలు ఏర్పరచుకుంటేనే కదా జీవితంలో ఉన్నతంగా ఎదగగలం.

Published : 14 Apr 2023 00:06 IST

కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవాలన్నా, నలుగురిలో కలవాలన్నా కొందరిని బెరుకు, భయం వెంటాడుతుంటాయి. మరి మంచి స్నేహాబంధాలు ఏర్పరచుకుంటేనే కదా జీవితంలో ఉన్నతంగా ఎదగగలం. అందుకు నిపుణులు చెబుతున్న సలహాలివే..

ఆసక్తి చూపండి...: ఎప్పుడూ మనం మాట్లాడటమేనా? ఇతరులు చెప్పేదీ వినగలిగితేనే అవతలివారు మనకు దగ్గరయ్యేది. ఎవరైనా ఏదైనా చెబుతుంటే మనసు పెట్టి విని చూడండి. వాళ్లు మీకెంత విలువనిస్తారో అర్థమవుతుంది. మొదట చిన్న చిన్న సంభాషణలతో మొదలుపెట్టినా క్రమేపీ మనతో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తారు.

శరీరభాష మార్చుకోవాలి... మన ఆలోచనలు, భావోద్వేగాలు బాడీ లాంగ్వేజ్లో ఇట్టే తెలిసిపోతాయి. చిన్న చిన్న విషయాల్లోనే ఎదుటివారికి మన మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎదుటివారి ప్రశ్నలకు స్పందించే తీరు మీ స్నేహానికి పునాది అవుతుంది. ఎవరైనా పలకరిస్తే చిర్రుబుర్రులాడకుండా నవ్వుతూ మాట్లాడండి. అప్పుడే నలుగురూ మీతో స్నేహం చేయటానికి ఆసక్తి చూపుతారు.

నమ్మకం: ఎవరైనా మనకు స్నేహంగా దగ్గరవ్వాలంటే మనపై నమ్మకమూ ఏర్పడాలి. అవతలివారి ఉద్వేగాలను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని బయటపెట్టేయకుండా భద్రంగా మీ దగ్గరే ఉంచుకోవడమూ ముఖ్యమే. ఏ బంధానికైనా నమ్మకమే ముఖ్యం కదా!

మీరే మాట్లాడండి.. ఎవరితోనైనా స్నేహం ఏర్పరచుకోవాలంటే...మీరే చొరవ తీసుకుని మాట్లాడండి. వారిపై మీకున్న సానుకూల అభిప్రాయం చెప్పండి. వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా స్పందించండి. అలాగని ఎదుటివారిని మెప్పించాలని మీకు నచ్చని పనులు చేయొద్దు. మీ భావాలేవైనా నిజాయతీగా పంచుకోగలిగితేనే స్నేహం చిగురిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్