డిగ్రీ విద్యార్థినులకు 24 వేల రూపాయల స్కాలర్‌షిప్..!

మనదేశంలో అక్షరాస్యత క్రమంగా పెరుగుతోన్నా.. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఇంకా వెనకబడే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొంతమంది అమ్మాయిలు సరిపడ ఆర్థిక వనరులు లభించక చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికి విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ....

Updated : 03 Nov 2022 20:32 IST

మనదేశంలో అక్షరాస్యత క్రమంగా పెరుగుతోన్నా.. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఇంకా వెనకబడే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొంతమంది అమ్మాయిలు సరిపడ ఆర్థిక వనరులు లభించక చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికి విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ స్కాలర్‌షిప్‌ల ద్వారా తమవంతు సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను పేద విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పేద విద్యార్థినులకు ఆర్థిక చేయూత అందించాలనే సంకల్పంతో విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ విప్రో కేర్స్‌తో కలిసి 2016-17లో ‘సంతూర్‌ స్కాలర్‌షిప్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే నిరుపేద విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ సంస్థ దాదాపు 4200 మంది విద్యార్థినులకు ఉపకార వేతనాలను అందించింది. తాజాగా 2022-23 సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు నవంబర్ 15, 2022 చివరి తేదీగా నిర్ణయించారు. ఈక్రమంలో ‘సంతూర్‌ స్కాలర్‌షిప్’కు ఎవరు అర్హులు, దరఖాస్తు విధానం వంటి వివరాలు తెలుసుకుందామా..

ప్రయోజనాలు

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు సంవత్సరానికి 24 వేల రూపాయల చొప్పున అందిస్తారు. ఈ మొత్తాన్ని ట్యూషన్‌ ఫీ లేదా చదువుకు సంబంధించిన ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

అర్హతలు:

⚛ సంతూర్‌ స్కాలర్‌షిప్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన నిరుపేద విద్యార్థినులు మాత్రమే అర్హులు.

⚛ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

⚛ 2021-22 విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వ పాఠశాల/జూనియర్‌ కాలేజీలో పూర్తి చేసి ఉండాలి.

⚛ ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులో నమోదు చేసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన ఫ్రూఫ్‌ (రుసుము చెల్లించిన రశీదు, అడ్మిషన్ లెటర్‌, ఐడీ కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌)ను జతచేయాల్సి ఉంటుంది. కోర్సు కాలపరిమితి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి.

ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి santoorscholarships.com వెబ్‌సైట్‌ను చూడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని