బ్రేకింగ్

breaking
04 May 2024 | 19:14 IST

సిట్‌ కస్టడీకి రేవణ్ణ

Update: బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణను సిట్‌ అదుపులోకి తీసుకుంది. అతడిపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడంతో కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో రేవణ్ణతోపాటు, ఆయన కుమారుడు ప్రజ్వల్‌ను ఇటీవల సిట్‌ విచారణకు పిలిచింది. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్‌ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. మరోవైపు రేవణ్ణ కూడా దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండటంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని

తాజా వార్తలు